Srikakulam: గ్రామంలో ఎలుగుబంట్లు స్వైర విహారం.. భయాందోళనలో ప్రజలు..!

|

Aug 24, 2023 | 9:18 PM

ఇటీవల చిరుతపులులు, ఎలుగుబంట్ల సంచారం ఎక్కువైపోయింది. అడవులను వదిలి ఆహారం కోసం గ్రామాల్లో చొరబడుతున్నాయి. తిరుపతి, శ్రీశైలంలో భక్తులపై దాడులకు తెగబడుతూ భక్తులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లాలోని ఉద్ధానం ప్రాంతంలో ఎలుగుబంట్లు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మందస మండలం మల్లెనవారి పేట గ్రామంలోకి..

ఇటీవల చిరుతపులులు, ఎలుగుబంట్ల సంచారం ఎక్కువైపోయింది. అడవులను వదిలి ఆహారం కోసం గ్రామాల్లో చొరబడుతున్నాయి. తిరుపతి, శ్రీశైలంలో భక్తులపై దాడులకు తెగబడుతూ భక్తులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లాలోని ఉద్ధానం ప్రాంతంలో ఎలుగుబంట్లు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మందస మండలం మల్లెనవారి పేట గ్రామంలోకి రాత్రి మూడు ఎలుగుబంట్లు చొరబడి హల్ చల్ చేసాయి. గ్రామ వీధుల్లో రాత్రంతా యధేచ్చగా సంచరిస్తూ గ్రామస్తులకు కంటి మీద కునుకు లేకుండా చేసాయి ఎలుగు బంట్లు. ఒక తల్లి ఎలుగుబంటి, రెండు పిల్ల ఎలుగుబoట్లు గ్రామంలోకి రావటoతో రాత్రంతా ఇళ్ళ నుండి బయటకు రాడానికి గ్రామస్తులు వణికిపోయారు. ఉద్దాన ప్రాంతంలోని రట్టి కొండలు, నల్ల బొడ్లూరు మెట్ట ప్రాంతం గతంలో ఎలుగుబంట్లుకు కేరాఫ్ అడ్రస్ గా ఉండేవి. ఈ ప్రాంతంలో ఉంటూ కొండజాతి ఫలాలు, సమీప జీడి,కొబ్బరి తోటలలో ఆహారం సేకరిస్తూ జీవనం కొనసాగించేవి. అడవులు తగ్గిపోవడంతో ఎలుగు బoట్లు ఆహారం కోసం జనావాసాల బాట పడుతున్నాయి. ఎలుగు బంట్లబారినుండి తమకు రక్షణ కల్పించాలని అటవీశాఖ అధికారులను ఉద్దానo ప్రాంత ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...