Bear: చెట్టు ఎక్కిన ఎలుగుబంటి.. ఏం చేసిందంటే.? వైరల్ అవుతున్న వీడియో.

|

Feb 06, 2024 | 7:01 PM

కరీంనగర్ జిల్లా మానకొండూరులో ఎలుగుబంటి‌ హల్ చల్ సృష్టించింది. కరీంనగర్, వరంగల్ రహాదారి ప్రక్కన‌ ఉన్న వేప చెట్టుపైకి కూర్చుని ఉన్న ఎలుగుబంటిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అటవీశాఖ అధికారులతో కలిసి అక్కడికి చేరుకున్న పోలీసులు స్థానికులను అప్రమత్తం చేశారు. ఎలుగుబంటిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేశారు. వరంగల్ లోని రెస్క్యూ టీం కి‌ సమాచారం అందించారు..ఎలుగుబంటి బరువు ఎక్కువగా ఉండడంతో వలలో చిక్కడం కష్టంగా ఉంటుందని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు.

కరీంనగర్ జిల్లా మానకొండూరులో ఎలుగుబంటి‌ హల్ చల్ సృష్టించింది. కరీంనగర్, వరంగల్ రహాదారి ప్రక్కన‌ ఉన్న వేప చెట్టుపైకి కూర్చుని ఉన్న ఎలుగుబంటిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అటవీశాఖ అధికారులతో కలిసి అక్కడికి చేరుకున్న పోలీసులు స్థానికులను అప్రమత్తం చేశారు. ఎలుగుబంటిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేశారు. వరంగల్ లోని రెస్క్యూ టీం కి‌ సమాచారం అందించారు..ఎలుగుబంటి బరువు ఎక్కువగా ఉండడంతో వలలో చిక్కడం కష్టంగా ఉంటుందని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో దానికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి బంధించే ప్రయత్నం చేశారు. గతంలో అన్నారం ఈదులగట్టుల పల్లిలో ప్రజలపైన ఎలుగుబంటి దాడి చేసిన సంఘటనలు ఉన్నాయి. ఈ నేఫధ్యంలొ ప్రజలని అప్రమత్తం చేస్తున్నారు. జాతీయ రహదారి ప్రక్కనే ఎలుగుబంటి ఉండడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడినది. ఏక్షణం ఎవరిపై దాడిచేస్తుందోనని, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఎవరికి ఎలాంటి ముప్పు వాటిల్లకుండా అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. స్థానికులను ఎవరినీ ఇళ్ళ నుండి బయటికి రావద్దంటూ హెచ్చరించారు. తరుచు ఈ ప్రాంతం లో ఎలుగు బంట్లు సంచరిస్తుండటంతో అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..