సోషల్ మీడియాలో ఎదైనా వింతగా కనిపిస్తే చాలు వెంటనే వైరల్ అయిపోతుంది. తాజాగా ఓ వ్యక్తికి ఎలుగు బంటి ఎదురుపడిన వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. అమెరికాలోని డేవిడ్ ఆప్పిన్హీమర్ అనే వ్యక్తి తన ఇంటి పెరట్లో ఓ పెద్ద కుర్చీ వేసుకుని మొబైల్ ఫోన్ వాడుతూ హాయిగా రిలాక్స్ అవుతుంటాడు. అయితే ఇంతలోనే ఓ ఎలుగుబంటి అతనికి దగ్గర్లో నడుచుకుంటూ వచ్చింది. ఆ ఎలుగుబంటిని చూసి డేవిడ్ భయంతో వణికిపోయాడు. ఏం చేయాలో తెలియక.. విస్తుపోయి చూస్తూ ఉండిపోయాడు. ఆ ఎలుగుబంటి కూడా అతడ్ని చూసి షాక్ అయ్యింది. కొన్ని క్షణాల పాటు ఇద్దరూ అలా ఒకరినొకరు భయంతోనే చూస్తూ ఉండిపోయారు. ఆ తర్వాత ఎలుగుబంటి అక్కడి నుంచి మెల్లిగా వెళ్ళిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. నెటిజన్లు విభిన్న రీతిలో తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం: Videos Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్.. Allu Arjun Vibrant Look: ఉగ్రగంగమ్మగా పుష్పరాజ్.. సీన్ దద్దరిల్లాలే.. నెట్టింట ఊచకోత కోస్తున్న బన్నీ వీడియో.. Pushpa-2 Video: పుష్ప అడుగుపడితే.. పులి కూడా కుక్క అయిపోవాలే..! సోషల్ మీడియాను రఫ్పాడిస్తున్న పుష్ప..