Bear Viral Video: అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించిన ఎలుగుబంటి మహిళ చేసిన పనికి నెటిజన్లు షాక్‌.. వైరల్ అవుతున్న వీడియో

|

Dec 16, 2021 | 9:05 AM

అప్పుడప్పుడూ జరిగే కొన్ని సంఘటనలు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అర్ధరాత్రి అనుకోకుండా మనింటికి ఏ వన్య మృగమో వచ్చిందనుకోండి ఎలా ఉంటుంది. భయంతో హడలి కేకలు పెడతాం కదా.. కానీ ఇక్కడ ఓ మహిళ అలా చేయలేదు...


అప్పుడప్పుడూ జరిగే కొన్ని సంఘటనలు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అర్ధరాత్రి అనుకోకుండా మనింటికి ఏ వన్య మృగమో వచ్చిందనుకోండి ఎలా ఉంటుంది. భయంతో హడలి కేకలు పెడతాం కదా.. కానీ ఇక్కడ ఓ మహిళ అలా చేయలేదు. అర్ధరాత్రి తన ఇంటికి వచ్చిన ఎలుగుబంటితో ఇప్పుడు కాదు.. రేపు మార్నింగ్‌ రా.. అన్నట్టుగా చెప్పి పంపించేసింది. మీ అనుమానం నాకు అర్ధమైంది.. అది పెంపుడు ఎలుగుబంటి అయ్యుంటుంది అనుకుంటున్నారు కదా… కానే కాదు… అసలు విషయం తెలుసుకుందాం.

అమెరికా న్యూజెర్సీలోని… వెర్నాన్‌కు చెందిన మహిళకు వన్యప్రాణులు అంటే విపరీతమైన ఇష్టం. ఆమె అదృష్టం కొద్దీ.. ఆమె ఇల్లు అడవి పక్కనే ఉంది. దాంతో ఆ ఇంటికీ, ఆ చుట్టుపక్కలకూ తరచూ వన్యమృగాలు వస్తూనే ఉంటాయి. అలా వచ్చే వాటికి ఆమె కూరగాయల తుక్కు, పండ్ల వంటివి పెడుతుంది. వాటిని తినేసి వెళ్లిపోతాయి. ఇలా ఆమె వాటికి బాగా అలవాటు పడింది. ఎంతలా అంటే… చివరకు ఆమె చెప్పినట్లు ఆ వన్యప్రాణులు వినాల్సిందే. తాజాగా రాత్రివేళ ఆమె ఇంటికి ఓ పెద్ద ఎలుగుబంటి వచ్చింది. తలుపుకొట్టింది. ఆమె తలుపు తీసింది. ఎలుగుబంటిని వీడియో రికార్డ్ చేస్తూ… “చల్లగాలి లోపలికి వచ్చేస్తోంది… డోర్ క్లోజ్ చెయ్యి” అని చెప్పింది. ఎలుగుబంటి… ఆమెవైపు కాసేపు అలా చూసి ఇక తనకు ఫుడ్ పెట్టదనుకుని… డోర్ వేసింది. పూర్తిగా వెయ్యకుండా… చివర్లో చిన్న గ్యాప్ ఉంచింది. దాంతో ఆ మహిళ… “మిస్టర్ బియర్.. దయచేసి డోర్ క్లోజ్ చేస్తావా” అని గట్టిగా చెప్పడంతో ఎలుగుబంటి పూర్తిగా డోర్ వేసేసింది. అలా ఎలుగుబంటి ఇంటి బయటే ఉండిపోయింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది.
అడవిలో తిరిగే ఎలుగు… ఆమె ఇంటికి రావడమేంటి… ఆమెకు హాని చెయ్యకుండా ఉండటమేంటి… ఆమె చెప్పినట్లు డోర్ వెయ్యడమేంటి… అంతా చందమామ కథలా ఉంది కదూ… అందుకే అందరూ ఆ వీడియో చూసి ఆశ్చర్యపోతున్నారు.

Published on: Dec 16, 2021 09:04 AM