అప్పుగా పెట్రోల్ పోయలేదని.. పొట్టు పొట్టు కొట్టిన ఖాకీ
బాపట్ల జిల్లా వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం జాతీయ రహదారి సమీపంలోని భారత్ పెట్రోల్ బంక్‌లో ఘర్షణ జరిగింది. 50 రూపాయలు అప్పుగా పెట్రోల్ పోయలేదన్న కోపంతో బంక్ సిబ్బందిపై ఓ ఏఆర్ కానిస్టేబుల్ దౌర్జన్యానికి దిగాడు. అప్పు ఎందుకు పోయవంటూ పెట్రోల్ బంకులో పనిచేస్తున్న ఓ యువకుడిని బాదిపారేశాడు. స్థానికంగా ఉన్న పెట్రోల్ బంక్‌కు ఓ ఏఆర్ కానిస్టేబుల్ తన మిత్రులతో కలసి వచ్చాడు.
తన బైక్‌కు పెట్రోల్ అప్పుగా కొట్టాలని సిబ్బందిని అడిగాడు. బంక్ సిబ్బంది మాత్రం యజమాని అనుమతి లేకుండా పెట్రోల్ అప్పుగా కొట్టడం కుదరదన్నారు. దీంతో కోపంతో ఊగిపోయిన ఆ ఏఆర్ కానిస్టేబుల్ విచక్షణ మరచి పెట్రోల్ బంక్ సిబ్బందిపై దాడి చేసి భయబ్రాంతులకు గురి చేశాడు. సిబ్బందిపై కానిస్టేబుల్ చేసిన దౌర్జన్యం, బూతు పురాణమంతా పెట్రోల్ బంక్‌లోని సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సిబ్బందిపై దాడి విషయం తెలుసుకున్న పెట్రోల్ బంక్ యజమాని వేటపాలెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. సిబ్బందిపై దాడికి పాల్పడిన ఏఆర్ కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవడంతో పాటు ఈ తరహా దాడులు పునరావృతం కాకుండా చూడాలని పోలీసులను కోరారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నవంబరు 1 నుంచి బ్యాంక్‌ల కొత్త రూల్స్ ఇవే
వారికి బంపరాఫర్.. గ్రాము బంగారంపై రూ.9,700 లాభం
రెండోసారి తండ్రి కాబోతున్న రామ్ చరణ్.. ఉపాసన సీమంతం వేడుక
చంద్రుడిపై నిర్మాణాలు అసాధ్యమా ?? కీలక సమాచారం పంపిన చంద్రయాన్-2
Diwali Sales 2025: దీపావళి సేల్స్ ఎన్ని లక్షల కోట్లు దాటాయంటే.. జనం ఎక్కువగా మోజు పడ్డవి ఇవే
