ఐస్‌క్రీమ్‌లో పాము పిల్ల.. వణుకు పుట్టిస్తున్న వీడియో

Updated on: Mar 17, 2025 | 7:41 AM

చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఐస్ క్రీమ్ లను ఎంతో ఇష్టంగా తింటారు. కొందరు రోజు ఏదో ఒక ఫ్లేవర్ ఐస్ క్రీమ్ ను ఇష్టంతో తింటారు. ఇప్పుడు ప్రతి పార్టీలో ఐస్​ క్రీం వడ్డిస్తున్నారు. మరికొందరు ఇంట్లోనే వెరైటీ ఐస్ క్రీమ్ తయారు చేసుకుంటారు. బడలికగా ఉన్నప్పుడు నచ్చిన ఐస్‌క్రీమ్‌ తింటే ప్రాణం లేచొచినట్లు అనిపిస్తుంది. కానీ పొరపాటున ఈ ఐస్‌క్రీమ్‌ గనుక తింటే ప్రాణాలు పోవడం ఖాయం.

ఇది స్నేక్‌ ఐస్‌క్రీం మరి! థాయిలాండ్‌లోని మియాంగ్‌ రాచ్‌బురీ రాష్ట్రం పార్క్‌ థో జిల్లాలో రేబాన్‌ అనే వ్యక్తి స్థానికంగా తన ఫేవరెట్‌ ‘బ్లాక్‌బీన్‌’ పాప్‌ సికిల్‌ ఐస్‌క్రీం కొన్నాడు. ఆత్రంగా రేపర్‌ తీయగానే చచ్చిన పాము పిల్ల కనిపించడంతో ఠారెత్తిపోయాడు. దాన్ని ఫొటో తీసి ‘ఫేస్‌బుక్‌’లో పెట్టాడు. నలుపు, పసుపు రంగుల్లో ఉన్న పాము పిల్ల ఐస్‌క్రీమ్‌లో గడ్డకట్టుకుపోయి కనిపించింది. ‘‘దాని కళ్లు తెరిచే ఉన్నాయి! ఇంకా బతికే ఉందా?’’ అంటూ పోస్టు పెట్టాడు. దాంతో ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అది ఓ రకమైన గోల్డెన్‌ ట్రీ రకం విషపూరిత పాము పిల్ల అని కొందరు రాసుకొచ్చారు. ఆ ఐస్‌క్రీంను ఏ అర్ధరాత్రో చిమ్మచీకట్లో రోడ్‌సైడ్‌ బండిపై కొని చప్పరిస్తే ఈపాటికి టపా కట్టేవాడివంటూ కొందరు జోకులు పేల్చారు. ఏ కోటిలోనో ఏ ఒక్కరినో ఇలాంటి అదృష్టం వరిస్తుంది. ఓసారి టేస్ట్‌ చేసి చూడు అని ఇంకొందరు పోస్టులు పెట్టారు.

మరిన్ని వీడియోల కోసం :

గుడ్డును మింగిన పాము.. కక్కలేక మింగలేక…చివరికి.. వీడియో

రాజకీయాల నుంచి సినిమాల్లోకి జగ్గారెడ్డి వీడియో

సెల్‌ఫోన్‌ ఎఫెక్ట్‌.. ఆ తల్లి చేసిన నిర్వాకం చూస్తే.. వీడియో

చిరంజీవి, పవన్ కల్యాణ్‌కు నాగబాబు ఎంత అప్పు ఉన్నారో తెలుసా..?

Published on: Mar 17, 2025 07:41 AM