Baby Girl Warning: వామ్మో..‘జంబలకిడి జారు మిఠాయా’ అంటూనే.. జాడించి తంతానంటోంది.. వీడియో వైరల్.

|

Jan 26, 2023 | 10:10 AM

ఓ తెలుగు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో గ్రామీణ ప్రాంతానికి చెందిన ఓ మహిళ పాడిన ‘జంబలకడి జారుమిఠాయ’ పాటు ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.


తాజాగా ఓ చిన్నారికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో చిన్నారి జారు మిఠాయ పాట పాడుతూనే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఆ వార్నింగ్ వింటే అమ్మ బాబోయ్ అని అనకమానరు. వైరల్ అవుతున్న వీడియోలోని ఓ చిన్నారి జంబలకిడి జారుమిఠాయ పాటను కాస్త మార్చి పాడుతూ రచ్చ రచ్చ చేసింది. ‘నేను చదివేస్తను చూడు.. నేను చదివేస్తను చూడు.. నాకు మార్కులు గానీ రాకపోతే నిన్ను కొట్టేస్తను చూడు జంబలకడి జారు మిఠాయా?’ అంటూ స్కూల్ టీచర్‌కే సీరియస్ వార్నింగ్ ఇచ్చేసింది. ఈ వీడియోను ఓ యూజర్‌ ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్‌ చేయగా.. అది కాస్తా వైరల్ అయ్యింది. చిన్నారి పాట రూపంలో ఇచ్చిన వార్నింగ్ చూసి అమ్మ బాబోయ్.. అంటూ జడుసుకుంటున్నారు. నెటిజన్లు ఈ వీడియోకు ఫన్నీ రియాక్షన్స్ ఇస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Chiranjeevi – Pawan Kalyan: వైసీపీతో పవన్ పోరాటం చేస్తే నాకేంటి సంబంధం.. చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ ..

Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..

Love couples: శృతిమించుతున్న యువతీ యువకులు జల్సాలు.. బైక్‌పై ప్రేమజంట వెకిలిచేష్టలు.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Published on: Jan 26, 2023 09:06 AM