ఈ కొండముచ్చు ఆసనాలు చూస్తే.. యోగా గురువులు కూడా బలాదూర్‌

Updated on: Nov 04, 2025 | 4:26 PM

అల్లరి చేష్టలకు కేరాఫ్‌ కోతులు. కొండముచ్చులు కూడా వీటికి ఏం తీసిపోవు. కొన్నిసార్లు అవి తమ అల్లరితో జనాలను ఎంత ఇబ్బంది పెడతాయో.. అలగే తమ చేష్టలతో వారి హృదయాలను గెలుచుకుంటాయి. అలాంటి ఓ కొండముచ్చుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

సాధారణంగా కుక్కలు మనుషులను గమనించడం ద్వారా చాలా విషయాలు.. త్వరగా నేర్చుకుంటాయి. ఈ విషయంలో తామేమీ తక్కువ కాదని ఈ కొండముచ్చు నిరూపించింది. కోతులు, కొండముచ్చులు కూడా తరచుగా మనుషులను అనుకరిస్తాయి అనడానికి ఈ వీడియోనే ఉదాహరణ. ఈ వీడియోలో ఒక అమ్మాయి తన ఇంటి మేడపైన ప్రశాంతంగా యోగా సాధన చేస్తుంది. ఎక్కడినుంచి వచ్చిందో ఓ కొండముచ్చు అక్కడికి సమీపంలో పిట్టగోడమీద వచ్చి కూర్చుంది. అది యోగాసనాలు వేస్తున్న యువతిని తదేకంగా గమనించింది. అంతే వెంటనే అదికూడా యోగాసనాలు వేయడం మొదలుపెట్టింది. ఆ అమ్మాయి ఒక కాలు పైకెత్తి నిటారుగా కూర్చున్నట్లు వీడియోలో ఉంది. ఈ కొండముచ్చు కూడా యువతి చేస్తున్న ఆసనాలను యాజ్‌టీజ్‌గా అనుకరిస్తుంది. అచ్చం ఆ అమ్మాయిలాగే తన కాళ్ళలో ఒకదాన్ని పట్టుకుని పైకి లేపుతుంది. అక్కడకి సమీపంలో ఉన్న ఓ వ్యక్తి ఇదంతా తన మొబైల్ లో వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ వీడియోను వీక్షించిన వేలాదిమంది నెటిజన్లు తమదైనశైలిలో కామెంట్లు చేశారు. ఒకరు “ఈ కొండముచ్చు మరో యోగా గురువు కాబోతున్నట్లు కనిపిస్తోంది” అని సరదాగా వ్యాఖ్యానించగా, “ఇప్పుడు వానరాలూ.. ఫిట్‌నెస్ మీద ఫోకస్ పెట్టాయి బాస్’ అని మరొకరు కామెంట్స్‌ పెట్టారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మలాశయం ద్వారా ఆక్సిజన్‌.. జపనీస్‌ శాస్త్రవేత్తల కొత్త టెక్నిక్‌ !!

వింటర్‌లో వింటేజీ రైలు జర్నీ.. ఈ మార్గంలో ప్రయాణం.. అస్సలు మిస్ కావొద్దు