Cancer Woman: కేన్సర్‌తో మరణానికి దగ్గరగా యువతి.. జీవితంలోని చివరి క్షణాలు వేలం!
ఆస్ట్రేలియాకు చెందిన 27 ఏళ్ల ఓ యువతి అత్యంత అరుదైన క్యాన్సర్‌తో బాధపడుతోంది. ఈ క్రమంలో ఆమె కీలక నిర్ణయం తీసుకుంది. తన జీవితంలో చివరి క్షణాలను ఆమె వేలం వేయాలనుకుంది. తద్వారా వచ్చే డబ్బును కేన్సర్‌పై పరిశోధనలకు, అలాగే క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకు ఉపయోగించాలని ఆమె తపన. మెల్‌బోర్న్‌కు చెందిన ఆమె పేరు ఎమిలీ లాహే. 27 ఏళ్ల వయసులో ‘ఎన్‌యూటీ కార్సినోమా’ అనే క్యాన్సర్ బారినపడింది.
ఆస్ట్రేలియాకు చెందిన 27 ఏళ్ల ఓ యువతి అత్యంత అరుదైన క్యాన్సర్‌తో బాధపడుతోంది. ఈ క్రమంలో ఆమె కీలక నిర్ణయం తీసుకుంది. తన జీవితంలో చివరి క్షణాలను ఆమె వేలం వేయాలనుకుంది. తద్వారా వచ్చే డబ్బును కేన్సర్‌పై పరిశోధనలకు, అలాగే క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకు ఉపయోగించాలని ఆమె తపన. మెల్‌బోర్న్‌కు చెందిన ఆమె పేరు ఎమిలీ లాహే. 27 ఏళ్ల వయసులో ‘ఎన్‌యూటీ కార్సినోమా’ అనే క్యాన్సర్ బారినపడింది. 9 నెలలకు మించి బతికే అవకాశం లేదని వైద్యులు తేల్చేశారు. అయితే, అమెరికాలో కటింగ్ ఎడ్జ్ చికిత్స తీసుకున్న తర్వాత ఆమె జీవితకాలం మరో మూడేళ్లు పెరిగింది. ఈ చికిత్స ఆస్ట్రేలియాలో లేదు.
క్షణక్షణానికి చావుకు దగ్గరవుతున్న లాహే జీవితంలో అత్యంత విలువైన చివరి క్షణాలను మూడు నిమిషాల చొప్పున వేలం వేయాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా ఆమె చివరి క్షణాలను దక్కించుకున్న వారికి లాహేతో కలిసి మూడు నిమిషాలు గడిపే అవకాశం కల్పిస్తారు. ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్న వారితో గడపడం ద్వారా జీవితంలో వారు అనుభవిస్తున్న భావోద్వేగ, మానసిక ప్రభావాన్ని గుర్తించే వీలు కలుగుతుంది. ఒకరి తర్వాత ఒకరిగా ఇలా 30 మందికి అనుమతిస్తారు. కరిగిపోతున్న క్షణాలను వారితో పంచుకునే క్రమంలో ఓ ప్రొజెక్టర్‌లో మూడు నిమిషాల సమయాన్ని కౌంట్‌డౌన్‌లో ప్రదర్శిస్తారు. ఈ వేలం ద్వారా ప్రజలు తమ జీవితాన్ని భిన్నమైన దృక్కోణంలో చూసే అవకాశం లభిస్తుందని లాహే చెప్పుకొచ్చింది. వర్తమానంలో జీవించాలని, ఎందుకంటే జీవితాన్ని కొనలేమని, సేవ్ చేయలేమని, అది ఒకసారి పోయిందంటే, పోయినట్టేనని వివరించింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.