దూసుకొచ్చిన ఖడ్గమృగం… షాకైన పర్యాటకులు.. ఏం జరిగిందంటే వీడియో

Updated on: Jun 05, 2025 | 3:56 PM

సరదాగా నేషనల్ పార్క్ కు వెళ్ళిన పర్యాటకులకు భయంకర అనుభవం ఎదురైంది. పర్యాటకులు పార్క్ లో సంచరిస్తున్న సమయంలో ఒక ఖడ్గమృగం వారి వాహనం పైకి దూసుకొచ్చింది. వాహనంపై దాడి చేయబోయింది. దీంతో అక్కడున్న వారంతా భయందోళనకు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అస్సోంలోని మానస్ నేషనల్ పార్క్ లో పర్యాటకులు పర్యటిస్తున్నారు. ఒక చోట ఆగిన పర్యాటకులు అక్కడున్న ఖడ్గమృగాలను చూస్తున్నారు.

ఒక ఖడ్గమృగం పర్యాటకుల వైపుకు దూసుకొచ్చింది. అంతటితో ఆగకుండా పర్యాటకులున్న వాహనంపై దాడి చేసింది. వాహనాన్ని ముందుకు వెనక్కు లాగుతూ వాహనాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేసింది. ఖడ్గమృగం అలా దాడి చేయడంతో పర్యాటకులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. అనంతరం కొద్దిసేపటికే ఖడ్గమృగం అక్కడినుంచి వెళ్ళిపోయింది. దీంతో పర్యాటకులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈ ఘటనపై తమకు సమాచారం అందినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు. అయితే పర్యాటకులపై ఖడ్గమృగాలు ఇలా దాడి చేయడం ఇదేమీ మొదటిసారి కాదు. నేషనల్ పార్క్ లో సఫారీకి వెళ్ళిన పర్యాటకుల జీపులపై పలుమార్లు దాడికి యత్నించాయి. కిలోమీటర్ల వరకు వెంబడించి భయాన్ని సృష్టించాయి.

మరిన్ని వీడియోల కోసం :

ఈసారి మరింత భయంకరంగా కరోనా? బాబా వంగా చెప్పినట్టే జరిగి తీరుతుందా? వీడియో

వామ్మో.. పాములతో కలిసి జీవిస్తున్న గ్రామస్తులు వీడియో

మిర్యాలగూడలో మిస్‌ 420..కూపీలాగితే ఖాకీలు సైతం షాకయ్యే క్రైమ్‌ వీడియో