Assam: అస్సాంలో వరదలు.. కజిరంగ నేషనల్‌ పార్క్‌లో 6 రైనోలు, 114 వన్యప్రాణాలు మృత్యువాత.

|

Jul 11, 2024 | 6:00 PM

అస్సాంలో వరదల బీభత్సం కొనసాగుతోంది. ఆరున్నర లక్షల మంది ఈ వరద బారినపడ్డారు. ఈ వరదల వల్ల అక్కడి కజిరంగ నేషనల్‌ పార్క్‌లోని 129 వన్యప్రాణులు మృత్యువాత పడినట్లుగా అధికారులు వెల్లడించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. వరదల కారణంగా ఇప్పటివరకు 6 ఖడ్గమృగాలు, 100 హాగ్ జింకలు, రెండు సాంబార్, ఒక ఒట్టర్ సహా 114 వన్యప్రాణులు ప్రాణాలు కోల్పోయాయి.

అస్సాంలో వరదల బీభత్సం కొనసాగుతోంది. ఆరున్నర లక్షల మంది ఈ వరద బారినపడ్డారు. ఈ వరదల వల్ల అక్కడి కజిరంగ నేషనల్‌ పార్క్‌లోని 129 వన్యప్రాణులు మృత్యువాత పడినట్లుగా అధికారులు వెల్లడించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. వరదల కారణంగా ఇప్పటివరకు 6 ఖడ్గమృగాలు, 100 హాగ్ జింకలు, రెండు సాంబార్, ఒక ఒట్టర్ సహా 114 వన్యప్రాణులు ప్రాణాలు కోల్పోయాయి. మరికొన్ని హాగ్ జింకలు, ఖడ్గమృగాలు, సాంబార్ సహా 96 వన్యప్రాణులను రక్షించారు. కాగా 2017 సంవత్సరంలో సంభవించిన భారీ వరదలకు ఈ పార్క్‌లోని 350 వన్యప్రాణులు మృత్యువాత పడ్డాయి.

కజిరంగా నేషనల్ పార్క్‌లోకి భారీగా చేరిన వరద నీటిలో ఖడ్గమృగం ఇబ్బందిపడుతున్న వీడియోను రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఎక్స్‌ వేదికగా షేర్‌ చేశారు. “ఇటీవల కజిరంగాలో వరద పరిస్థితుల గురించి తెలుసుకుంటున్నప్పుడు, వరద నీటిలో చిక్కుకొని ఒంటరిగా ఉన్న ఈ ఖడ్గ మృగాన్ని గమనించి, దానిని వెంటనే రక్షించాల్సిందిగా అధికారులను ఆదేశించాను. రాష్ట్రాన్ని ముంచెత్తుతున్న వరదలు మానవులకు, వన్యప్రాణులకు ప్రమాదకరంగా మారాయి. ప్రజల సంరక్షణార్థం రాష్ట్రంలోని సహాయక బృందాల బృందం 24 గంటలూ శ్రమిస్తున్నాయి” అని శర్మ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on