ఇది కదా మానవత్వమంటే !! బిడ్డల ఆకలి తీర్చేందుకు రూ.55 లక్షల సాయం !!

|

Dec 28, 2022 | 9:55 AM

భర్తను కోల్పోయిన ఆ తల్లి, తన పిల్లల ఆకలి తీర్చేందుకు డబ్బులేక కడుపేదరికంలో మగ్గిపోతోంది. ఇందుకు సంబంధించి ఓ మహిళ సాయం కోరుతూ సోషల్‌ మీడియాలో అభ్యర్థించింది.

భర్తను కోల్పోయిన ఆ తల్లి, తన పిల్లల ఆకలి తీర్చేందుకు డబ్బులేక కడుపేదరికంలో మగ్గిపోతోంది. ఇందుకు సంబంధించి ఓ మహిళ సాయం కోరుతూ సోషల్‌ మీడియాలో అభ్యర్థించింది. దీంతో ఊహించని రీతిలో ఆమెకు విరాళాల రూపంలో లక్షలాది రూపాయల సాయం అందింది. కేరళకు చెందిన సుభద్ర భర్త ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. ముగ్గురు బిడ్డల తల్లైన సుభద్రకు పూట గడవడమే కష్టంగా మారింది. సెలబ్రల్ పాల్సి అనే వింత వ్యాధితో బాధపడుతున్న చిన్న కొడుకుతో ఎల్లప్పుడూ దగ్గరే ఉండవల్సిన పరిస్థితి. దీంతో కుటుంబ జీవనానికి ఉపాధి లేక తల్లడిల్లిపోయింది. విషయం తెలుసుకున్న తన రెండో కొడుకు చదివే స్థానిక పాఠశాల హిందీ టీచర్ గిరిజ హరికుమార్ వద్దకు వెళ్లి 500 రూపాయల సాయం కోరింది. ఆమె దీనపరిస్థితిని చూసి చలించిపోయిన టీచర్‌ గిరిజ హరికుమార్ 1000 రూపాయలు ఇచ్చారు. అంతటితో ఆగకుండా ఫేస్‌ బుక్‌లో క్రౌడ్ ఫండింగ్ క్యాంపెయిన్ ప్రారంభించారు. తోచినంత సాయం చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని తన పోస్టులో కోరారు. ఆ పోస్టులో సుభద్ర బ్యాంకు అకౌంట్ వివరాలను కూడా జత చేయడంతో.. దాతలు అందించే డబ్బు నేరుగా సుభద్ర అకౌంట్లోకి చేరాయి. ఇలా ఏకంగా 55లక్షల రూపాయల వరకు జమ కావడంతో ఆ తల్లి సంతోషానికి అవధుల్లేకుండాపోయాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చైనాలో నిమ్మకాయలను ఎగబడి కొంటున్న జనం.. కారణం ఏంటంటే ??

లిక్కర్‌ లారీ బోల్తా.. మందుబాటిళ్లకోసం ఎగబడిన జనం..

విపరీతమైన కడుపు నొప్పితో ఆస్పత్రికి బాలుడు.. ఎక్స్‌రే చూసి వైద్యులు షాక్‌ !!

ఇదేం ఉద్యోగం సామీ.. వచ్చిపోయే రైళ్లను లెక్కించాలట

ఏం టాలెంట్ బాస్.. క్షణాల్లో చీర కట్టి చూపించాడు.. మగువలు ఫిదా

Published on: Dec 28, 2022 09:55 AM