Lorry Driver: ఇదేందయ్యా ఇది.! లారీ డ్రైవర్ నిర్లక్ష్యం.. రిస్క్‌లో పడ్డ 20 మంది.!

|

Dec 05, 2024 | 5:23 PM

ఓ లారీ డ్రైవర్ నిర్లక్ష్యం ఎంతో మంది ప్రాణాల మీదికి తెచ్చినంత పని చేసింది. ముందు జాగ్రత్తలు పాటించకుండా చేసిన ఒక చిన్న తప్పు పెద్ద సమస్యకు దారి తీసింది. లారీ నుంచి ఆయిల్ లీకేజీ జరగడంతో దాదాపుగా 20 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన హైదరాబాద్ నగరం మేడ్చల్ పరిధిలో చోటు చేసుకుంది.

ఏ వాహనానికైనా ముందు దాని కండిషన్ చెక్ చేయడం తప్పనిసరి. అంతా బాగుంది అని నిర్ధారించుకుంటేనే రోడ్డు మీదికి వెళ్లడం సరైన పద్ధతి. కానీ ఇక్కడ ఆ లారీ డ్రైవర్ చాలా పెద్ద తప్పు చేశాడు. నిర్లక్ష్యమో లేక ఏం జరుగుతుందిలే అన్న ధీమానో కాని.. అతను చేసిన ఆ తప్పు వల్ల చాలా మంది ఇబ్బంది పడాల్సి వచ్చింది. నాగారం మున్సిపల్ పరిధి ఎస్వీ నగర్లో మెయిన్ రోడ్డుపై వెళ్తున్న ఓ లారీ నుంచి ఆయిల్ లీకైంది. అది గమనించని ద్విచక్ర వాహనదారులు దాని పైనుంచే వెళ్లడంతో జర్రున జారి ఒకరి తర్వాత ఒకరు రోడ్డుపై బోల్తాపడ్డారు. అలా దాదాపుగా 20 మందికి స్వల్ప గాయాలయ్యాయి. తద్వారా ఒకరు చేసిన తప్పిదానికి అంతమంది ఇబ్బంది పడాల్సి వచ్చింది.

జారిన బండ్లతో రోడ్డుపై ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. ఆ తర్వాత అదే మార్గంలో వస్తున్న కొందరు దీనిని చూసి రూట్ మార్చుకుని వెనక్కి తిరిగి వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు రోడ్డుపై నుంచి ఆయిల్ ను తొలగించే ప్రయత్నం చేశారు. ఇక ఆ మార్గంలో వచ్చే వాహనదారులు ఇబ్బందులు పడకుండా పోలీసులు ముందు జాగ్రత్తలు తీసుకున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.