Arasavalli: అరసవిల్లిలో భక్తులకు నిరాశ.. స్వామిని తాకని సూర్య కిరణాలు..

| Edited By: Ravi Kiran

Oct 03, 2023 | 2:56 PM

ఈ అపురూప ఘట్టాన్ని కనులారా వీక్షించేందుకు.. దూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెల్లవారు జాము నుంచే ఆలయంలో బారులు తీరారు. అయితే భక్తులకు నిరాశే ఎదురైంది. రాత్రి నుంచి చిరుజల్లులు మబ్బులతో వాతావరణం ఉండటంతో సూర్య కిరణాలు ఆలయంలోని స్వామి వారి విగ్రహంపై పడలేదు. దీంతో భక్తులు నిరాశతో వెనుదిరిగారు. ఇక రెండో రోజు కూడా భక్తులకు నిరాశే ఎదురైంది.

ఈ అపురూప ఘట్టాన్ని కనులారా వీక్షించేందుకు.. దూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెల్లవారు జాము నుంచే ఆలయంలో బారులు తీరారు. అయితే భక్తులకు నిరాశే ఎదురైంది. రాత్రి నుంచి చిరుజల్లులు మబ్బులతో వాతావరణం ఉండటంతో సూర్య కిరణాలు ఆలయంలోని స్వామి వారి విగ్రహంపై పడలేదు. దీంతో భక్తులు నిరాశతో వెనుదిరిగారు. ఇక రెండో రోజు కూడా భక్తులకు నిరాశే ఎదురైంది. రెండో రోజు కూడా ఆకాశంలో కారు మబ్బులు వీడలేదు. దీంతో ఆలయంలోని స్వామివారి విగ్రహాన్ని సూర్య కిరణాలు తాకలేదు. అద్భుత ఘట్టాన్ని వీక్షించకుండానే భక్తులు వెను తిరిగారు. శ్రీ సూర్యనారాయణ స్వామిని ప్రత్యక్షదైవం, ఆరోగ్య ప్రదాతగా భక్తులు భావిస్తుంటారు. మండపం, ధ్వజ స్తంభాన్ని దాటుకొని ఆలయ ప్రాకారానికి 400 అడుగులు దూరంలో ఉన్న మూలవిరాట్టును సూర్యకిరణాలు తాకుతాయి. ఈ దృశ్యాన్ని చూసిన భక్తులకు ఆరోగ్యం, ఐశ్వర్యం సిద్ధించి వారు ఆనందంగా ఉంటారనేది భక్తుల నమ్మకం. అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఏటా ఆవిష్క్రతమయ్యే అద్భుత ఘట్టం ఈసారి కనిపించలేదు. దీంతో నిరాశతో వెనుదిరిగారు భక్తులు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..

Published on: Oct 03, 2023 02:46 PM