ఆమె హోటల్‌ బిల్లు రూ.6 లక్షలు.. అకౌంట్‌లో కేవలం రూ.41లు.. చివరికి ??

|

Feb 03, 2024 | 1:58 PM

విలాసవంతమైన హోటల్‌లో బసచేసిన ఓ మహిళ బిల్లు ఎగ్గొట్టడానికి మాస్టర్‌ ప్లాన్‌ వేసింది. కానీ ప్లాన్‌ బెడిసికొట్టడంతో కటకటాలపాలైంది. ఏపీకి చెందిన ఝాన్సీరాణి అనే మహిళ డిసెంబరు నెలలో ఢిల్లీలోని పుల్‌మాన్‌ హోటల్‌లో 15 రోజులకు గాను రూమ్‌ బుక్‌ చేసుకుంది. ఆమెకు 15 రోజులకు గాను మొత్తం బిల్లు 5,88,176 రూపాయలు అయింది. హోటల్‌ను విడిచివెళ్లే సమయంలో ఓ యూపీఐ యాప్‌ ద్వారా డబ్బులు పంపినట్లు సిబ్బందికి చూపించింది.

విలాసవంతమైన హోటల్‌లో బసచేసిన ఓ మహిళ బిల్లు ఎగ్గొట్టడానికి మాస్టర్‌ ప్లాన్‌ వేసింది. కానీ ప్లాన్‌ బెడిసికొట్టడంతో కటకటాలపాలైంది. ఏపీకి చెందిన ఝాన్సీరాణి అనే మహిళ డిసెంబరు నెలలో ఢిల్లీలోని పుల్‌మాన్‌ హోటల్‌లో 15 రోజులకు గాను రూమ్‌ బుక్‌ చేసుకుంది. ఆమెకు 15 రోజులకు గాను మొత్తం బిల్లు 5,88,176 రూపాయలు అయింది. హోటల్‌ను విడిచివెళ్లే సమయంలో ఓ యూపీఐ యాప్‌ ద్వారా డబ్బులు పంపినట్లు సిబ్బందికి చూపించింది. బ్యాంకు ఖాతాలో డబ్బులు పడకపోవడంతో అనుమానం వచ్చి సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు విచారించి జనవరి 13న సదరు మహిళను అరెస్టు చేశారు. ఆమె ఉపయోగించిన ఖాతా నకిలీదని తేలింది. హోటల్‌లో స్పా సౌకర్యం కోసం ఆమె ఏకంగా 2,11,708 రూపాయలను ఖర్చు చేశారని, ఆమె పేరును ఇషా దేవ్‌గా నకిలీ ఐడెంటిటీ కార్డును చూపించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆమె 15 రోజుల బిల్లు మొత్తం దాదాపు ఆరు లక్షలు కాగా ఆమె ఎకౌంట్‌లో కేవలం 41 రూపాయలు మాత్రమే ఉన్నాయని పోలీసులు మంగళవారం వెల్లడించారు.

Also Watch:

అయోధ్య రాముడి దర్శనానికి వెళుతున్నారా ?? మీకో బంపరాఫర్‌

Mahesh Babu: సినిమా పక్కకు పెడితే.. మహేష్ జాకెట్‌ రేటే అన్ని లక్షలా..

Upasana Kamineni: వావ్ !! మెగా కోడలికి గ్రేట్ హానర్..

Rajamouli: దెబ్బ అదుర్స్‌ కదా.. జక్కన్నా మజాకా..

గుడ్ న్యూస్ బయటికి వచ్చిన కేశవ ?? ఇక షూటింగ్ పరుగో పరుగు