ఉచిత బస్సులో కూర్చొన్నాడని.. ఉతికి పారేశారు.. బాబోయ్ అలా కొట్టారు ఏంటి

Updated on: Dec 03, 2025 | 5:53 PM

ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంతో మహిళల రద్దీ పెరిగి సీట్ల కోసం గొడవలు జరుగుతున్నాయి. పురుష ప్రయాణికులు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా తుని బస్సులో సీటు కోసం ఓ మహిళ పురుషుడిపై దాడి చేయడం ఆందోళన కలిగిస్తోంది. ఉచిత పథకం వల్ల పెరుగుతున్న ఈ వివాదాలు సమాజంలో కొత్త సమస్యలకు దారితీస్తున్నాయి.

కొన్ని సంఘటనల గురించి తెలుసుకుంటుంటే… ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం పురుష ప్రయాణికుల పాలిటి శాపంగా మారుతుందేమో అనిపిస్తోంది. బస్సుల్లో సీట్ల కోసం దాడులకు పాల్పడటం, ఆర్టీసీ సిబ్బందిని సైతం ఇబ్బందులకు గురిచేయడం లాంటి సంఘటనలు తరచూ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. ఏపీ, తెలంగాణాలో మహిళలకు ఆయా ప్రభుత్వాలు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించాయి. ఈ పథకం అమలులోకి వచ్చినప్పటినుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణిల రద్దీ బాగా పెరిగింది. ఈ క్రమంలో సీట్ల కోసం కొట్టుకోవడం సర్వసాధారణంగా మారిపోయింది. తాజాగా ఏపీలోని తునినుంచి నర్సీపట్నం వెళ్తున్న ఆర్టీసీ బస్సులో సీటు కోసం జరిగిన ఓ చిన్న వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఓ మహిళ తోటి ప్రయాణికుడిపై దాడి చేసి, జుట్టు పట్టుకుని చితకబాదింది. అసలేం జరిగిందంటే.. కొంతమంది మహిళలు బస్సు ఎక్కే క్రమంలో ఓ సీటులో కర్చీఫ్ వేసి ఉంచారు. అది గమనించని ఓ ప్రయాణికుడు ఆ సీటులో కూర్చున్నాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఓ మహిళ, మేము కర్చీఫ్ వేసిన సీట్లో ఎలా కూర్చుంటావు? అంటూ అతడితో వాగ్వాదానికి దిగింది. మాటామాటా పెరగడంతో ఆమె సహనం కోల్పోయి, సదరు ప్రయాణికుడి జుట్టు పట్టుకుని కొట్టింది. ఊహించని పరిణామానికి అతడు నివ్వెరపోయాడు. ఈ క్రమంలో అక్కడి కొందరు మహిళలు సైతం అతడి మీద మాటల యుద్ధానికి దిగటంతో బస్సులో గందరగోళం నెలకొంది. తోటి ప్రయాణికులు చూస్తుండగానే ఈ గొడవ జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన విషయం తెలిసిందే. ఈ పథకం అమల్లోకి వచ్చాక బస్సుల్లో మహిళల రద్దీ గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో సీట్ల కోసం తరచూ ఇలాంటి వివాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఐటీ రిఫండ్‌ ఇంకా రాలేదా ?? అయితే కారణం ఇదే

అయ్యో.. బురదలో ఇరుకున్న ఏనుగు.. కట్ చేస్తే..

ర్యాపిడో బైక్‌ రైడర్‌ ఖాతాలో రూ.331 కోట్లు.. ఈడీ దర్యాప్తు

ప్రపంచంలో అతిపెద్ద శివలింగం బీహార్‌లో త్వరలో ప్రతిష్టాపన

Elon Musk: ఇండియన్స్ లేకుండా అమెరికా అభివృద్ధి అసాధ్యం