Ahobilam: రాష్ట్ర పండుగగా అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి పార్వేట ఉత్సవం.

|

Mar 13, 2024 | 5:26 PM

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలో కొలువైన అహోబిల లక్ష్మీనరసింహస్వామివారి పార్వేట ఉత్సవాన్ని ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది. నవ నరసింహ క్షేత్రాలలో ఈ అహోబిల లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం ప్రముఖమైనదిగా చెప్తారు. ఈ ఉత్సవాన్ని విజయదశమి లేదా సంక్రాంతి సందర్భంగా 40 రోజులపాటునిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక శాఖ మంత్రి రోజా స్వామివారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించారు.

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలో కొలువైన అహోబిల లక్ష్మీనరసింహస్వామివారి పార్వేట ఉత్సవాన్ని ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది. నవ నరసింహ క్షేత్రాలలో ఈ అహోబిల లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం ప్రముఖమైనదిగా చెప్తారు. ఈ ఉత్సవాన్ని విజయదశమి లేదా సంక్రాంతి సందర్భంగా 40 రోజులపాటునిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక శాఖ మంత్రి రోజా స్వామివారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రాచీన పుణ్యక్షేత్రమైన అహోబిలం దేవస్థానం అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా 25 కోట్ల రూపాయలు నిధులను మంజూరు చేయడం జరిగిందని మంత్రి రోజా తెలిపారు. ఆలయ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామన్న రోజా రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామి, అమ్మ వార్లకు పట్టు వస్త్రాలను సమర్పించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. తాను ఈ శాఖలో ఉండడం వల్ల తనకు ఈ అదృష్టం దక్కిందన్నారు. తనకు ఈ అదృష్టాన్ని కల్పించిన ముఖ్యమంత్రి జగన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..