మహిళా కండక్టర్ సెల్ఫీ వీడియోపై ఆర్టీసీ రియాక్షన్

Updated on: Sep 19, 2025 | 6:38 PM

ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెం ఆర్టీసీ డిపో మహిళా కండక్టర్ సెల్ఫీ వీడియో వివాదాస్పదంగా మారింది. ఏపీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకం తమ పాలిట శాపంగా మారిందంటూ మహిళా కండక్టర్ చేసిన సెల్ఫీ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఎంత బ్రతిమాలినా ప్రయాణికులు సహకరించటం లేదంటూ సెల్ఫీ వీడియోలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు కండక్టర్.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమెపై ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు విచారణకు ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తోంది. దీంతో మహిళలు సంతోషం వ్యకం చేశారు. ఈ పథకం వలన మహిళలకు మంచి జరిగినప్పటికి కొందరు మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అక్కడక్కడా ఆర్టీసీ బస్సులో సీట్ల కోసం గొడవలు తప్పడం లేదు. జంగారెడ్డిగూడెం డిపోకు చెందిన మహిళా కండక్టర్ ఉచితబస్సు పథకం తమ పాలిట శాపంలా మారిందంటూ వాపోయింది. మహిళా కండక్టర్ వీడియో చేసిన మరోసటి రోజు నుంచే విధులు కేటాయించకపోవడంతో సహచర కండక్టర్లు అభ్యంతరం తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

త్వరలోనే భారత్‌లో 6 జీ సేవలు.. హైదరాబాద్ ఐఐటీది కీలక పాత్ర

ఆర్టీసీలో ఉద్యోగమే మీ లక్ష్యమా? అయితే ఈ గుడ్‌ న్యూస్‌ మీకే

TOP 9 ET News: నెట్‌ఫ్లిక్స్‌ నుంచి మైండ్‌ షేక్‌ డీల్

ప్రేమాభిషేకం, డాక్టర్‌ చక్రవర్తి సినిమాలు రీ-రిలీజ్‌.. అందరికీ టికెట్స్ ఫ్రీ..

RGVపై దహనం ఎఫెక్ట్.. పోలీస్‌ స్టేషన్‌ మెట్లెక్కిన ఆమె..!‌