Wayanad Floods: వయనాడ్‌కు పొంచి ఉన్న మరో ముప్పు.! మళ్లీ కొండచరియలు విరిగిపడే ప్రమాదం
వయనాడ్‌లో వరద విలయం కొనసాగుతోంది.. మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. వందల మంది నిరాశ్రయులయ్యారు. దేవభూమిలో వరద విలయం కన్నీళ్లు పెట్టిస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నా కొద్దీ మృతదేహాలు వెలుగులోకి వస్తున్నాయి. మరోవైపు వర్షం కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. పర్యటక ప్రాంతమైన మెప్పాడలో పరిస్థితి ఘోరంగా ఉంది.
వయనాడ్‌లో వరద విలయం కొనసాగుతోంది.. మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. వందల మంది నిరాశ్రయులయ్యారు. దేవభూమిలో వరద విలయం కన్నీళ్లు పెట్టిస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నా కొద్దీ మృతదేహాలు వెలుగులోకి వస్తున్నాయి. మరోవైపు వర్షం కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. పర్యటక ప్రాంతమైన మెప్పాడలో పరిస్థితి ఘోరంగా ఉంది. కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో సీఎం విజయన్ ఏరియల్ వ్యూ నిర్వహించారు. కాసేపట్లో రాహుల్, ప్రియాంకాగాంధీ సహాయక శిబిరాలను సందర్శిస్తారు. మళ్లీ వర్షాలు కురుస్తున్నందున మరోసారి కొండచరియలు విరిగిపడే అవకాశాలు ఉన్నాయని NDRF సిబ్బంది చెబుతున్నారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ చూరల్‌మల్‌లోనే కొనసాగుతోంది. ఇక్కడి నుంచి 100 అడుగులపైన ముండక్కై గ్రామం ఉంది. అక్కడికి వెళ్లేందుకు దారులు క్లోజ్ అయ్యాయి. దీంతో తాత్కాలిక వంతెనలను నిర్మిస్తున్నారు ఆర్మీ అధికారులు. ఇది పూర్తయితేనే.. ముండక్కై వెళ్లే వీలుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.