Angry Bride: పెళ్ళి వేదికపైనే వరుడిపై కోపగించుకున్న వధువు.. ఆమె ఏం చేసిందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..

Updated on: Dec 22, 2022 | 9:37 AM

పెళ్లి అంటేనే చాలా సరదా వాతావరణం ఉంటుంది. ఇక వాటికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో చాలా పోస్ట్ అవుతుంటాయి. ఇక మన దేశంలో జరిగే పెళ్లి వేడుకలలో హంగామా, భావోద్వేగాలు, హడావుడి సహజం. అయితే

ఇప్పుడు పెళ్లిలో వరమాల వేడుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోలో వరమాల కార్యక్రమం అయిపోయిన తర్వాత దంపతులు ఇద్దరూ ఒకరికొకరు స్వీట్లు తినిపించుకోవాలని అనుకుంటారు. ఈ క్రమంలో ముందుగా వధువు ఒక స్వీట్ ముక్కను వరుడికి తినమని ఇవ్వగా అతను తినకుండా దానిని విసిరేస్తాడు. తర్వాత వరుడు వధువుకు స్వీట్ తినిపించబోగా ఆమె కోపంగా అతని చేతిలోని స్వీట్‌ లాక్కొని అక్కడున్న వారిమీదకు విసిరేసింది. మహేంద్ర భారతి అనే వ్యక్తి ఫేస్‌బుక్‌లో ఈ వీడియోను షేర్ చేసారు. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసినవారంతా తెగ నవ్వేసుకుంటున్నారు. ఇంకా నెటిజన్లు వారి వారి స్పందనలను కామెంట్ ద్వారా తెలియజేస్తున్నారు. ఓ నెటిజన్ అయితే ‘గలాత్ హై’ అని రాస్తే, మరొకరు ‘షాదీ హో రహీ హై యా దుష్మానీ?’ అని కామెంట్ చేశాడు. ఇంకో నెటిజన్ అయితే ‘చెడు సంస్కారాలు’ అని రాసుకొచ్చాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Partners Relationship: సంసారంలో స్మార్ట్‌గా చిచ్చు.. ఇలాగైతే మొదటికే మోసం..! వైవాహిక జీవితం బాగుండాలి అంటే..

Shocking Video: ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా గూడె కట్టేశాయి.. చెవి స్కానింగ్‌లో బయటపడ్డ షాకింగ్ సీన్..

Murder: దారుణం.. అప్పు ఇచ్చిన పాపానికి గొంతు, నరాలు కోసి హత్య చేసారు.! పోలీసులు ఏమ్మన్నారు అంటే..

Published on: Dec 22, 2022 09:37 AM