Chick in Egg: అంగన్వాడి కోడి గుడ్డులో కోడి పిల్ల ప్రత్యక్షం.. వీడియో వైరల్.!
పిల్లలకు పౌష్ఠికాహార సరఫరాలో భాగంగా ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా కోడిగుడ్లు, ఇతర పోషకాహార పదార్ధాలను సరఫరా చేస్తుంది. ఈ క్రమంలో ప్రభుత్వం సరఫరా చేసిన కోడిగుడ్డును పిల్లలకు గుడ్లను ఉడికించి పెడదామని చూసేసరికి ఓ గుడ్డులో కోడిపిల్ల కనిపించింది. దాంతో అందరూ షాకయ్యారు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని కోరుట్ల పట్టణం రథాలపంపు గ్రామానికి చెందిన ఆకుల మన్విత అనే చిన్నారికి స్థానిక అంగన్వాడీ టీచర్ కోడిగుడ్లను అందజేసింది.
పిల్లలకు పౌష్ఠికాహార సరఫరాలో భాగంగా ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా కోడిగుడ్లు, ఇతర పోషకాహార పదార్ధాలను సరఫరా చేస్తుంది. ఈ క్రమంలో ప్రభుత్వం సరఫరా చేసిన కోడిగుడ్డును పిల్లలకు గుడ్లను ఉడికించి పెడదామని చూసేసరికి ఓ గుడ్డులో కోడిపిల్ల కనిపించింది. దాంతో అందరూ షాకయ్యారు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని కోరుట్ల పట్టణం రథాలపంపు గ్రామానికి చెందిన ఆకుల మన్విత అనే చిన్నారికి స్థానిక అంగన్వాడీ టీచర్ కోడిగుడ్లను అందజేసింది. కాగా ఆదివారం చిన్నారికి కోడి గుడ్డును అందించేందుకు ఉడకబెట్టే క్రమంలో ఓ గుడ్డు బరువు తక్కువగా ఉండి తేడాగా ఉన్నట్లు గమనించారు. వెంటనే గుడ్డు పై పెంకు తొలిచి చూడగా లోపల కోడిపిల్ల కదులుతూ కనిపించింది. దీంతో మన్విత తల్లిదండ్రులు ఆశ్చర్యానికి గురై విషయం స్థానికులకు చెప్పారు. పిల్లగా మారిన గుడ్డును వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కోడిగుడ్డు దుర్వాసన రావడం, గుడ్లు పిల్లలుగా మారిపోతుండటంతో గుడ్లు తినడానికి భయపడుతున్నారు. నాణ్యత లేని గుడ్లు సరఫరా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారులు, గర్భిణిల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నాణ్యమైన ఆహారాన్ని అందించాలని కోరుతున్నారు. ఈ వ్యవహారం పై అధికారులు విచారణ చేపట్టారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.