Srisailam: శ్రీశైలంలో కొబ్బరి చిప్పల కోసం వచ్చిన ఎలుగుబంటి.. వీడియో చూశారా..?
ఏపీలో వన్యప్రాణుల సంచారం కలకలం రేపుతోంది. ఇప్పటికే తిరుమలతో చిరుత ఓ పాపను బలి తీసుకోగా.. దాన్ని బంధించారు. అయితే దాన్ని బంధించి.. 24 గంటలు కూడా గడవకుండానే.. తిరుమలలో మరో చిరుత సంచారం టెన్షన్ పుట్టిస్తుంది. ఇటు శ్రీశైలం ఎలుగుబంటి కలకలం రేపింది. శిఖరం వద్ద రాత్రి 10 గంటల సమయంలో ఎలుగుబంటి ప్రత్యక్షమైంది. దాన్ని అక్కడి సెక్యూరిటీ సిబ్బంది సెల్‌పోన్లలో చిత్రీకరించారు. వారు గట్టిగా కేకలు వేయడంతో అది అక్కడి నుంచి పారిపోయింది.
శ్రీశైలం సమీపంలోని శిఖరం వద్ద రాత్రి 10 గంటల సమయంలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది. రాత్రి డ్యూటీలో ఉన్న ఒక పూజారి, అలానే దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది ఎలుగుబంటి సంచారాన్ని తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించారు. సెక్యూరిటీ సిబ్బంది గట్టిగా అరుస్తూ చప్పుడు చేయడంతో ఎలుగుబంటి పక్కన ఉన్న అటవీప్రాంతంలోకి వెళ్ళిపోయింది. అయితే భక్తులు శిఖర దర్శనానికి వెళ్లే మెట్ల మార్గంలో ఈ ఎలుగుబంటి సంచరిస్తుందని చెబుతున్నారు. భక్తులు దేవుడికి సమర్పించే కొబ్బరికాయలు తిని అటునుండి అటవీప్రాంతంలోకి వెళ్తుందట. రాత్రి సమయంలో ఈ ఎలుగుబంటి సంచరించడంతో రాత్రి డ్యూటీలో ఉన్న సిబ్బంది భయాందోళనలకు గురవుతున్నారు. గతంలోనూ ఇదే ప్రాంతంలో పలుమార్లు ఎలుగుబంటి సంచరించడంతో భక్తులు భయపడుతున్నారు.
Published on: Aug 14, 2023 12:42 PM