చీకట్లో నడిచి వెళ్తున్న రైతు.. ఎదురుగ కనిపించింది చూసి భయంతో వీడియో
విజయనగరం జిల్లా డెంకాడ మండలం గునుపూరు పేటకు ఒక అరుదైన వన్యజీవి హల్ చల్ చేస్తుంది. కొండ ప్రాంతం నుంచి రాత్రి సమయంలో గ్రామంలోకి ప్రవేశించింది ఆ వన్య ప్రాణి. ఓ రైతు అటుగా వెళుతూ ఆ ప్రాణినీ చూసి చీకట్లో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. భయంతో అక్కడి నుంచి పరుగులు తీసిన రైతు విషయాన్ని ఇతర గ్రామస్తులకు తెలియజేశాడు. దీంతో గ్రామస్తులంతా అక్కడికి చేరుకున్నారు. అప్పటికే ఆ వన్యప్రాణి పక్కనే ఉన్న మురికి కాలువలోకి దిగి వేగంగా అటు ఇటు పరిగెడుతూ హంగామా చేస్తుంది. దీంతో గ్రామస్తులు మరింత భయపడ్డారు.
కొంతసేపటి తర్వాత అది ఒక ప్రదేశంలో ఆగిపోయింది. వెంటనే గ్రామస్తులంతా కలిసి మెరుపు వేగంతో ఆ వన్యప్రాణిని ఒదిసి పట్టుకున్నారు. అయితే ఆ ప్రాణినీ పట్టుకున్న తర్వాత గ్రామస్తులు మరింత భయపడ్డారు. కారణం దాని వంటి నిండా పదునైన పొలుసులతో పట్టుకుంటే చెయ్యి కూడా తెగిపోయేలా కనిపించింది. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్న డిప్యూటీ ఫారెస్ట్ రేంజర్ సుబ్బారావు వన్యజంతువును స్వాధీనం చేసుకున్నారు. ఆ వన్యప్రాణీ నిశితంగా పరిశీలించిన అధికారులు ఇదొక అరుదైన చిప్పల అలుగు అని నిర్ధారించారు. చిప్పల అలుగును కొన్ని ప్రాంతాల్లో పాంగోలిన్ అని కూడా పిలుస్తారు. పాంగోలిన్ అనేది కేవలం ఒక అరుదైన వన్యప్రాణి మాత్రమే కాదని అది పర్యావరణ సమతుల్యతలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ఇవి చీమలు, చెదులు వంటి కీటకాలను ఆహారంగా తీసుకుంటాయని ఒక్కో పాంగోలిన్ రోజుకు వేలాది చీమలను తినగలదని అలా పాంగోలిన్ వల్ల అడవులు చెదలు రక్షణ పొందుతున్నాయని తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం :