చౌడేశ్వరి ఆలయంలో అర్థరాత్రి వేళ వెలుతురు.. వెళ్లి చూస్తే షాక్!
పురాతన దేవాలయాలు, రాజులు పాలించిన కోటలు, పురాతన భవనాలు ఉన్న చోట దండిగా గుప్త నిధులు ఉంటాయని స్వామీజీలు చెప్పారని చాలా మంది గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపి కటకటాల పాలయ్యారు. మూఢనమ్మకాలతో ఈజీగా డబ్బు సంపాదించాలన్న ఆశతో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపిన ఘటనలు అనేకం ఉన్నాయి. కానీ అనంతపురం జిల్లాలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపిన కేటుగాళ్ళు లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి పోలీసులనే ఆశ్చర్యపరిచారు. గుంతకల్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే నాగసముద్రం శివారులో గుప్తనిధుల తవ్వకాలు జరుపుతున్న ముఠాను రెడ్ హాండెడ్ గా పట్టుకున్న పోలీసులు షాకయ్యారు. బహుశా గుప్తనిధుల తవ్వకాల్లో ఫస్ట్ టైం అత్యాధునిక టెక్నాలజీ వాడటం ఇదే తొలిసారి కావచ్చు.
గుప్తనిధుల కోసం వాటిని గుర్తించేందుకు ఏకంగా మెటల్ డిటెక్టర్లు, గోల్డ్ స్కానర్లు తీసుకొచ్చి గుప్తనిధుల తవ్వకాలు జరిపిన ముఠా గుట్టురట్టు చేశారు. నాగసముద్రం గ్రామ శివారులో కొంతమంది వ్యక్తులు అర్ధరాత్రి గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నట్లు గుంతకల్ రూరల్ పోలీసులకు సమాచారం అందింది. ఘటనాస్థలికి వెళ్ళిన పోలీసులు తొమ్మిది మందిని అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్ కు చెందిన మహేంద్ర అనే వ్యక్తి మరో నలుగురితో గుంతకల్ కు వచ్చాడు. గుంతకల్ కు చెందిన రాముతో కలిపి మొత్తం తొమ్మిది మంది ఒక ముఠాగా ఏర్పడ్డారు. గుంతకల్ పరిసర ప్రాంతాల్లో గుప్తనిధుల కోసం వేట మొదలు పెట్టారు. నాగసముద్రం శివారు కొండపై ఉన్న చౌడేశ్వరి అమ్మవారి దేవాలయం పరిసరాల్లో మహేంద్ర అండ్ కో ముఠా గుప్తనిధుల కోసం గత కొద్ది రోజులుగా తవ్వకాలు జరుపుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు కొండపై ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకొని పలుగు, పారలతో తవ్వకాలు జరుపుతున్నారని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు కొండపై గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న ముఠాను రెడ్ హాండెడ్ గా పట్టుకున్నారు. వారి దగ్గర పలుగు, గడ్డపారలతో పాటు కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు, అత్యాధునిక మెటల్ డిటెక్టర్లు, గోల్డ్ స్కానర్లను పోలీసులు గుర్తించారు.
మరిన్ని వీడియోల కోసం :
కేవలం రూ.100కే ఇల్లు.. ఎక్కడో తెలుసా? వీడియో
వరుణ్ బర్త్ డే.. భార్య ఇచ్చిన గిఫ్ట్ చూసి ఒక్కసారిగా షాక్ వీడియో
ర్యాపిడో రైడ్‌లో సెల్ఫీ వీడియో రికార్డ్ చేసిన యువతి..! డ్రైవర్ చేసిన పనితో వీడియో