సామాన్యుల్లో ఒకరిగా అపర కుబేరుడు.. పబ్లిక్ ట్రామ్‌లో దుబాయ్ రాజు!
సాధారణంగా దేశ పాలకులు కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రయాణాలు సాగిస్తుంటారు. ఏదైనా ప్రాంత సందర్శనకు వెళ్లాలన్నా అధికారులు పది రోజులు ముందుగానే ఏర్పాట్లు చేస్తుంటారు. ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేస్తుంటారు. అయితే, దుబాయ్ పాలకుడు అందుకు విరుద్ధంగా పబ్లిక్ ట్రామ్‌లో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.
దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తమ్ మరోసారి అక్కడి ప్రజలను సర్ ప్రైజ్ చేశారు. సామాన్యుడిలా జనంలో కలిసిపోయి ట్రామ్ లో ప్రయాణించారు. ఇందుకు సంబంధించిన వీడియోను దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్ పోర్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇన్ స్టా, టిక్ టాక్ లలో ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ వెంట కొంతమంది భద్రతా సిబ్బంది సివిల్ డ్రెస్సుల్లో కనిపించారు.అయితే, ఈ ప్రయాణంలో రాజు కానీ, ఆయన భద్రతా సిబ్బంది కానీ ఎలాంటి హడావుడి చేయకపోవడం విశేషం. మిగతా ప్రయాణికుల్లానే వారంతా ట్రామ్ కోసం స్టేషన్‌లో వేచి ఉండడం, ట్రామ్ రాగానే మిగతా వారితో పాటు లోపలికి వెళ్లి ఓ ఖాళీ సీటులో కూర్చోవడం వీడియోలో కనిపించింది. దేశాన్ని పాలించే రాజు తమతో కలిసి ట్రామ్‌లో ఎక్కడం చూసి తోటి ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. కొందరు ఈ దృశ్యాన్ని తమ సెల్ ఫోన్లలో బంధించారు. ప్రస్తుతం ఆ వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇది చూసిన నెటిజన్లు దుబాయ్ పాలకుడి సింప్లిసిటీని మెచ్చుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
కేవలం రూ.100కే ఇల్లు.. ఎక్కడో తెలుసా? వీడియో
వరుణ్ బర్త్ డే.. భార్య ఇచ్చిన గిఫ్ట్ చూసి ఒక్కసారిగా షాక్ వీడియో
ర్యాపిడో రైడ్‌లో సెల్ఫీ వీడియో రికార్డ్ చేసిన యువతి..! డ్రైవర్ చేసిన పనితో వీడియో
తోటి కూలీల మధ్య షష్టిపూర్తి.. ఆత్మీయతకు నిదర్శనం
కన్ఫర్మ్డ్ టికెట్లు ఉన్నా దొరకని బెర్తులు..
78 ఏళ్ల తర్వాత కలిసిన బాల్యమిత్రులు!
ఛీ.. ఛీ.. రైలు టాయిలెట్లో భోజన పాత్రలు కడిగిన IRCTC సిబ్బంది
24 గంటల్లో 47 వేల మొక్కలు.. గిన్నిస్ రికార్డు!
వీడెవడండీ బాబూ.. వెనుక రైలు వస్తున్నా నడుస్తూనే ఉన్నాడు!
ఏసీ రిపేర్‌కు వచ్చి.. ఆర్టిస్ట్‌కు సర్ప్రైజ్ ఇచ్చిన మెకానిక్స్!

