Watch Video: ఇంట్లో ప్రత్యక్షమైన నాగుపాము.. చాకచక్యంగా పట్టుకున్న స్నేక్ క్యాచర్..
Snake Video: శ్రీ సత్యసాయి జిల్లాలో ఓ ఇంట్లో ప్రత్యక్షమైన నాగు పాము స్థానికంగా కలకలం సృష్టించింది. కొత్త చెరువు మండలం కదిరేపల్లిలో ఓ ఇంట్లోకి నాగు పాము ప్రవేశించింది.
శ్రీ సత్యసాయి జిల్లాలో ఓ ఇంట్లో ప్రత్యక్షమైన నాగు పాము స్థానికంగా కలకలం సృష్టించింది. కొత్త చెరువు మండలం కదిరేపల్లిలో ఓ ఇంట్లోకి ఏడు అడుగుల పొడవైన నాగు పాము ప్రవేశించింది. ఆదినారాయణ అనే వ్యక్తి ఇంటిలోకి దూరింది ఆ పొడవైన నాగుపాము. ఇంట్లో నాగుపామును చూసిన ఆదినారాయణ కుటుంబ సభ్యులు భయంతో ఇంటి నుండి బయటికి పరుగులు తీశారు. దీంతో స్థానికులు భయబ్రాంతులకు గురైయ్యారు. స్థానికులు స్నేక్ క్యాచర్ కి సమాచారం ఇచ్చారు. స్నేక్ క్యాచర్ మూర్తి ఇంట్లో నక్కిన నాగు పామును చాకచక్యంగా పట్టుకున్నాడు. చైన్ స్నాచర్ దాన్ని అడవిలోకి వదిలి పెట్టడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.
Published on: May 08, 2023 12:42 PM