ఈ ప్రభుత్వ టీచర్ ప్రయత్నం అద్భుతం వీడియో

Updated on: Apr 25, 2025 | 1:26 PM

ప్రస్తుత కాలంలో తమ ఊరిలో ప్రభుత్వ పాఠశాల ఉందనే విషయమే మర్చిపోతున్నారు జనాలు. మంచి చదువు అంటే ప్రైవేట్ స్కూల్లోనే అని ఫిక్స్ అయిపోయారు. ఇంగ్లీష్ మీడియం తప్ప తెలుగు మీడియం చదువు చదివే కాదనే ధోరణికి అలవాటు పడిపోయారు. ఇంటి పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు పౌష్టికాహారంతో కూడిన మంచి భోజనం, బట్టలు, పుస్తకాలు ఇలా అన్నీ ఉచితంగా సమకూరుస్తున్న గవర్నమెంట్ స్కూల్ వైపు చూసేందుకు తల్లిదండ్రులు ఇష్టపడటం లేదు. కార్పొరేట్ చదువులకే మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో విద్యార్థులను ఎలా అయినా ప్రభుత్వ పాఠశాలకు రప్పించాలని ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కంకణం కట్టుకున్నాడు. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా కార్పొరేట్‌ను మించిన చదువు దొరుకుతుందని అర్థమయ్యేలా ప్రజలకు చెప్పాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా బైక్ పైన తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలల్లో స్టూడెంట్స్‌కు కల్పించే సదుపాయాలను, చదువు చెప్పే విధానం గురించి ప్రచారం చేస్తున్నాడు.

ఏజెన్సీలో బైక్‌కు మైక్ కట్టి ప్రచారం చేస్తున్న ఈ మాస్టర్‌ను అందరూ ప్రశంసిస్తున్నారు. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం ములగలంపల్లి మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు మూడు రమేష్ బాబు ఈ కార్యక్రమానికి వస్తారు. బడి యుడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ద్విచక్ర వాహనంపై తిరుగుతూ మైక్‌తో ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ బడుల్లో విజయవంతంగా అమలు చేస్తున్న కార్యక్రమాల ఫోటోలు వివరాలతో ముద్రించిన కరపత్రాలతో ఇంటింటికి వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులకు వివరిస్తున్నారు. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా బోధన అందిస్తున్నట్టు చెబుతున్నారు. ఇప్పటివరకు ములగలంపల్లి, రౌతుగూడెం, రవీంద్రనగర్, కనకపురం, పాకాలగూడెం తదితర గ్రామాల్లో ప్రచారం చేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏప్రిల్ 21 నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోంది. అంగన్వాడీలో చదివిన వారిని ఫస్ట్ క్లాసులో చేర్పించడంతో పాటు ఐదో తరగతి పూర్తి చేసిన వారిని ఆ పై తరగతులకు పంపేలా కార్యక్రమం చేపట్టారు. విద్యా సంవత్సరం ముగుస్తున్నందున ఏప్రిల్ 23 వరకు ఈ కార్యక్రమం జరగబోతోంది. మరోవైపు డీఎస్సీ నోటిఫికేషన్ కూడా విడుదల కావడంతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్స్ కొరత కూడా తీరి అవకాశం ఉంది.

మరిన్ని వీడియోల కోసం :

తాటి ముంజలు ఇష్టంగా తింటున్నారా? వీడియో

వామ్మో.. బుసలు కొడుతున్న కింగ్ కోబ్రాలు వీడియో

పుష్ప2 సినిమాకు డ్యాన్స్ అదర గొట్టిన మాజీసీఎం వీడియో