Ganesh Chaturthi: భక్తులను ఆకట్టుకుంటున్న చాక్లెట్ వినాయకుడు..

|

Sep 19, 2023 | 5:29 PM

వినాయక చవితి వచ్చిందంటే చాలు విగ్రహాలు తయారు చేసే వారి ఆలోచనలకు, నైపుణ్యానికి పదును పెడతారు.... ఎన్నో రూపాల్లో వినాయకుడి విగ్రహం తయారు చేసి...తమ భక్తిని చాటుకుంటారు శిల్పులు... బొజ్జ గణపయ్య బొజ్జ నిండా చాక్లెట్స్ తో నింపేశాడు ఓ ఓత్సాహికుడు... అనంతపురం జిల్లా పామిడి పట్టణంలో చాక్లెట్ల వినాయకుడు కొలువుదీరాడు . చిన్న పిల్లలకు ఇష్టమైన చాక్లెట్లతో వినాయకుడిని తయారుచేశాడు

వినాయక చవితి వచ్చిందంటే చాలు విగ్రహాలు తయారు చేసే వారి ఆలోచనలకు, నైపుణ్యానికి పదును పెడతారు…. ఎన్నో రూపాల్లో వినాయకుడి విగ్రహం తయారు చేసి…తమ భక్తిని చాటుకుంటారు శిల్పులు… బొజ్జ గణపయ్య బొజ్జ నిండా చాక్లెట్స్ తో నింపేశాడు ఓ ఓత్సాహికుడు… అనంతపురం జిల్లా పామిడి పట్టణంలో చాక్లెట్ల వినాయకుడు కొలువుదీరాడు . చిన్న పిల్లలకు ఇష్టమైన చాక్లెట్లతో వినాయకుడిని తయారుచేశాడు ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి… పర్యావరణానికి ఎలాంటి హాని చేకూరకుండా చాక్లెట్లతో గణనాథుడిని కొలువు తీర్చాడు ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి. బెంగుళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న పామిడి పట్టణానికి చెందిన నాగతేజ ప్రతీ సంవత్సరం పర్యావరణానికి హాని కలుగని వినాయకుడి విగ్రహాలను తయారు చేస్తూ ఉంటాడు. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా వైరైటీగా గణనాధుడి ప్రతిమ రూపొందించాడు… చిన్న పిల్లలకు ఇష్టమైన చాక్లెట్లతో వినాయకుడిని తయారు చేసి మరోసారి తన ప్రతిభను చాటుకున్నాడు. వినాయకుడిని అనేక రకాల చాక్లెట్లతో తయారు చేశామని….. విగ్రహం తయారు చేయటానికి ఇరవై వేల రూపాయలు ఖర్చయ్యిందని…..నిమిజ్జనం రోజున చాక్లెట్లను భక్తులకు పంచుతామని నాగతేజ అంటున్నాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మనిషికి పంది కిడ్నీలో కీలక విజయం !! ఏకంగా రెండు నెలలు పని చేసింది

అద్భుత కళ !! ముని గోటిపై ఇమిడిపోయేలా బుజ్జి గణపతి

పొత్తి కడుపులో.. బొజ్జ గణపయ్యా !! యోగాతో కళాఖండాలు

ఔరా !! పెన్సిల్ మొనపై పవళింపు గణపతి

TOP 9 ET News: అటు మనవరాలితో చిరు చవితి వేడుక | ఇటు కోడలితో నాగబాబు వినాయకుడి పూజ

Follow us on