40 ఏళ్లుగా మ్యూజియంలో నక్కిన అతిపెద్ద పాము

Updated on: Jan 29, 2026 | 7:57 AM

ఇంగ్లాండ్ దక్షిణ తీరంలో లభించిన ఓ అరుదైన పాము శిలాజం, దశాబ్దాల పాటు మ్యూజియంలో ఉండిపోయింది. సుమారు 40 ఏళ్ల తర్వాత శాస్త్రవేత్తలు ఆ శిలాజానికి సంబంధించిన రహస్యాన్ని ఛేదించారు. లండన్‌లోని నేచురల్ హిస్టరీ మ్యూజియంలో భద్రపరిచిన ఈ అవశేషాలు ఇప్పటివరకు ప్రపంచానికి తెలియని ఓ కొత్త జాతి పాముకి చెందినవిగా గుర్తించారు.

ఈ పురాతన పాముకు పారడాక్సోఫిడియన్ రిచర్డోవెని అనే పేరు పెట్టారు. ఇది సుమారు 37 మిలియన్ సంవత్సరాల క్రితం, ఇంగ్లాండ్‌లో ఇప్పటికంటే ఎంతో వేడిగా ఉండి సరీసృపాలు విరివిగా సంచరించిన కాలంలో జీవించినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. 1981లో హోర్డిల్ క్లిఫ్ వద్ద ఈ పాముకు సంబంధించి వెన్నుముక ఎముకలు కొన్ని లభించాయి. వాటిద్వారా ఈ పామును శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ పాము ఆధునిక పాముల్లో కనిపించే విభిన్న లక్షణాల మిశ్రమాన్ని కలిగి ఉండటంతో దీనిని “పారడాక్స్ పాము”గా పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రస్తుత అత్యంత వైవిధ్యభరితమైన పాము వర్గమైన కేనోఫిడియన్ సమూహానికి ఇది ప్రారంభ దశలోని జాతిగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీంతో ఆధునిక పాములు ఎలా పరిణామం చెందాయన్న ప్రశ్నకు ఈ ఆవిష్కరణ కీలక సమాధానాలను ఇస్తోంది.

మరిన్ని వీడియోల కోసం :

టోల్‌గేట్‌ వద్ద గుట్టు గుట్టలుగా నోట్ల కట్టలు!

స్థిరంగా బంగారం ధరలు.. బడ్జెట్‌ తర్వాత తగ్గే ఛాన్స్‌?

ఏడేళ్లుగా రైల్వేపై విద్యార్థిని పోరాటం..చివరకు..

చిరు వ్యాపారులకు అమెజాన్‌ బిగ్‌ ఆఫర్‌