పునాదులు తవ్వుతుండగా దొరికిన బంగారు నిధి..

Updated on: Jan 17, 2026 | 11:45 AM

పురావస్తు శాఖ తవ్వకాల్లో రకరకాల అవశేషాలు, నిధి నిక్షేపాలు వెలుగుచూస్తుంటాయి. అంతేకాదు, ఆలయాలు, పురాతన ఇళ్లు పునర్నిర్మించే క్రమంలో పునాదులు తవ్వుతారు. ఇలాంటి సందర్భాల్లో కూడా పురాతన దేవతా విగ్రహాలు, బంగారు నాణేలు లాంటివి బయటపడిన ఘటనలూ ఉన్నాయి. తాజాగా కర్నాటకలోని గడగ్‌ జిల్లాలో ఇంటి నిర్మాణం కోసం పునాదులు తవ్వుతుండగా బంగారు నిధి బయటపడింది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

గడగ్‌ జిల్లా లక్కుండి గ్రామంలో జనవరి 10న ఇంటి కోసం పునాదులు తవ్వుతుండగా బంగారంతో నిండిన రాగి బిందెను 8 ఏళ్ల బాలుడు రిట్టి గుర్తించాడు. దానిని నిధిగా భావించిన కుటుంబసభ్యులు ఆ బంగారాన్ని జిల్లా అధికారులకు అప్పగించారు. అయితే ఆదివారం పురావస్తు శాఖకు చెందిన అధికారులు నిధి దొరికిన చోటుకు వచ్చారు. జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో ఆ ప్రాంతం మొత్తాన్ని పరిశీలించారు. ఆ నిధిని ప్రభుత్వ ఆస్తి కింద పరిగణించాలా వద్దా అనే సందిగ్ధం నెలకొంది. దీంతో నిధి దొరికిన ప్రాంతంలో సమగ్రంగా తనిఖీలు చేసి నివేదిక ఇవ్వాలని జిల్లా యంత్రాంగం ఆదేశించింది. కాగా జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో జనవరి 13న భారత పురావస్తు సర్వే, రాష్ట్ర పురావస్తు శాఖ నిపుణులు బంగారు ఆభరణాలను పరీక్షించారు. నగల తయారీలో హస్తకళా నైపుణ్యం, ఆభరణాల రూపురేఖలను బట్టి అవి విజయనగర కాలంనాటివి కావచ్చని అంచనా వేశారు. ఆనాటి రాజకీయ, సామాజిక, సాంస్కృతిని ప్రతిబింబిస్తున్నాయని అభిప్రాయపడ్డారు.

మరిన్ని వీడియోల కోసం :

బలగం వేణు రెండో సినిమాపై క్లారిటీ వీడియో

ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?

యాభై ఏళ్లుగా నిద్రపోని వింత వ్యక్తి.. డాక్లర్లే పరేషాన్‌!

సంక్రాంతి వచ్చిందంటే నిజామాబాద్ లో నోరూరించే ఘేవర్ స్వీట్