వారి కాలి స్పర్శ తగిలితే దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయా !!
శ్రీ సత్య సాయి జిల్లా మడకశిరలో జరిగే భూతప్పల ఉత్సవం ఓ వింత సంప్రదాయం. ఇక్కడ దైవ స్వరూపులైన భూతప్పల కాలి స్పర్శతో దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయని, సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని భక్తులు నమ్ముతారు. వందల ఏళ్లుగా కొనసాగుతున్న ఈ ఆచారం ప్రకారం, భక్తులు భూతప్పలు నడిచే మార్గంలో పొర్లుదండాలు పెట్టి పడుకుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా, ఇతర ప్రాంతాల నుంచి కూడా వేలాదిగా భక్తులు ఈ అద్భుత నమ్మకంతో మొక్కులు చెల్లించుకుంటారు.
దైవ స్వరూపులుగా పిలవబడే వాళ్ళ కాలి స్పర్శ తగిలితే దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయట… సంతానం లేని వారికి సంతానం కలుగుతుందట. శ్రీ సత్య సాయి జిల్లా మడకశిరలో జరిగే భూతప్పల ఉత్సవంలో…. ఈ వింత ఆచారం అందరిని ఆకట్టుకుంటుంది. తడి బట్టలతో భూతప్పలు నడిచే మార్గంలో పొర్లుదండాలు పెట్టి పడుకుంటే వారి కాలి స్పర్శతో సమస్యలు తీరుతాయని అక్కడి ప్రజల విశ్వసిస్తారు. ఈ భూతప్పల ఉత్సవంలో పాల్గొనేందుకు వేలాదిగా జనం తరలివస్తారు. ఒక చేత్తో కత్తి, మరో చేత్తో కవచం పట్టుకొని భీకరమైన రూపంలో కనిపించే ఈ భూతప్పలను మడకశిర చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు దైవ స్వరూపులుగా భావిస్తారు. మడకశిర మండలంలోని భక్తరహళ్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి, జిల్లేడు గుంట ఆంజనేయ స్వాముల బ్రహ్మోత్సవాలలో ప్రతి సంవత్సరం ఈ భూతప్పలు దర్శనమిస్తారు. ఇక్కడ వందల ఏళ్ల నుంచి ఈ భూతప్పల ఉత్సవం జరుగుతుంది. వారం రోజులు పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాల్లో భూతప్పల ఉత్సవం ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. భక్తులు తమ మొక్కులు చెల్లించుకున్న తర్వాత…. జరిగే తంతు అందరికీ ఒక వింత ఆచారంగా కనిపిస్తుంది. లక్ష్మీనరసింహస్వామి, ఆంజనేయస్వామి ఉత్సవ విగ్రహాలను పూలతో అందంగా అలంకరించి ఊరేగింపుగా తీసుకొస్తారు. స్వామి ఉత్సవ విగ్రహాల ముందు కత్తి కవచం చేత పట్టుకుని ఒక వింత వేషధారణలో వచ్చే నాట్యం చేస్తూ వస్తారు ఈ భూతప్పలు. ఈ భూతప్పలు వచ్చే దారిలో భక్తులు ఉపవాస దీక్షతో, తడి బట్టలతో బోర్లా పడుకుని పొర్లు దండాలు పెడతారు. అలా బోర్లా పడుకున్న భక్తులను భూతప్పలు తొక్కుకుంటూ వారిపైనుంచి నడుస్తూ ముందుకు సాగుతారు. భూతప్పల కాలి స్పర్శ తగిలితే కోరిన కోరికలు నెరవేరుతాయిని, దీర్ఘకాలిక రోగాలు తగ్గుతాయని, సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని విశ్వసిస్తారు. చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులని తేడా లేకుండా భూతప్పల కాలి స్పర్శ కోసం వారు నడిచే దారిలో బోర్లా పడుకుని ఉంటారు. తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాలనుంచి కూడా భక్తులు ఇక్కడికి వస్తారు. ఇది ఓ మూఢనమ్మకం అని కొందరు కొట్టిపారేసినా.. వందల సంవత్సరాలుగా తమ పూర్వీకులు నుంచి వస్తున్న సాంప్రదాయం అంటున్నారు స్థానికులు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇక దానికి ఆధార్ కార్డు చెల్లదు.. భారీ మార్పులు.. బిగ్ అలర్ట్..
తత్కాల్ కౌంటర్ బుకింగ్స్‌లో కీలక మార్పు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
ఉద్యోగులకు షాక్.. ఇకపై ఎలాంటి పొడిగింపులు ఉండవు !! బాంబు పేల్చిన EPFO
లోన్ తీసుకున్న వారికి భారీ ఉపశమనం.. గుడ్ న్యూస్ చెప్పిన ఆర్బీఐ