దారుణం.. దసరాకు సెలవు ఇవ్వలేదని పసికందు ఉసురు తీశారు

Updated on: Oct 06, 2025 | 6:51 PM

దసరా పండక్కి సెలవివ్వలేదన్న కోపంతో ఓ పసికందు ఉసురు తీశారు అనంతపురం శిశుగృహ సిబ్బంది. చేసిన పాపం కప్పెయ్యాలని గుట్టుచప్పుడు కాకుండా శిశువు మృతదేహాన్ని పూడ్చేశారు. ఈ క్రమంలో శిశుగృహ సిబ్బంది మధ్య తలెత్తిన వివాదంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై స్పందించిన సీఎం చంద్రబాబు అధికారులను ఆరా తీశారు.

శిశు గృహంలో పసికందు మృతిపై విచారణకు త్రీ మెన్ కమిటీ ఏర్పాటు చేశారు జిల్లా కలెక్టర్. ఈ కమిటీలో DM అండ్ HO, ICDS PD, ప్రభుత్వ ఆసుపత్రి పీడియాట్రిషన్ HOD ఉన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంకి చెందిన ఓ తల్లి తన రెండు నెలల శిశువును పోషించలేక నెలరోజుల క్రితం అనంతపురం శిశుగృహంలో అప్పగించింది. ఇటీవల దసరా సెలవుల విషయంలో విభేదాలొచ్చిన శిశుగృహ సిబ్బంది నిర్లక్ష్యం ఆ పసికందు ప్రాణాలను తీసింది. సెలవులు ఇవ్వలేదన్న కోపంతో నైట్‌ షిఫ్ట్‌లో ఉన్న ఆయాలు శిశువుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆకలితో ఏడుస్తున్న చిన్నారికి సకాలంలో పాలు పట్టకపోవడంతో ఆకలితో ఏడ్చి ఏడ్చి ఆ పసికందు ప్రాణాలు వదిలింది. చిన్నారికి అనారోగ్యం చేసిందంటూ ఆస్పత్రికి తీసుకు వెళ్లగా అప్పటికే శిశువు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయం బయటకు తెలిస్తే గొడవ అవుతుందని గుట్టు చప్పుడు కాకుండా శిశువు మృతదేహాన్ని పూడ్చి పెట్టేశారు శిశుగృహ, ఐసీడిఎస్ సిబ్బంది. అనంతరం నైట్‌ డ్యూటీలో ఉన్న ఆయాల మధ్య వివాదం మొదలైంది. తప్పు నీదంటే నీదంటూ పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. ఈ ఘటనపై సీరియస్‌ అయిన జిల్లా కలెక్టర్‌ పసికందు మృతిపై సమగ్ర విచారణకు ఆదేశించారు. శిశు సంరక్షణ కేంద్రంలో పసిబిడ్డ మృతిపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. మంత్రి సంధ్యారాణితో మాట్లాడిన సిఎం చంద్రబాబు ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విరిగిపడిన కొండచరియలు.. ఆరుగురు మృతి

మాయదారి మహమ్మారికి నవ వధువు బలి

దడ పుట్టిస్తున్న బంగారం ధర.. మండిపోతున్న వెండి..

రోజుకో ఉసిరికాయ తింటే ఏమవుతుందో తెలిస్తే..

సమయం వృథా చేస్తున్నారా ??ఈ టిప్స్‌ పాటిస్తే సక్సెస్‌ మీదే