ఏటీఎంలో చోరీకి విఫల యత్నం.. చివరికి ఇలా..

Updated on: Mar 18, 2026 | 5:02 PM

అనంతపురంలో ఏటీఎం దోపిడీకి యత్నించిన సాయికుమార్ సినిమా స్టైల్‌లో దొరికిపోయాడు. ఇండియన్ బ్యాంక్ ఏటీఎంను పగులగొట్టబోగా, సేఫ్టీ సైరన్ మోగడంతో భయపడి పారిపోయాడు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు అతన్ని గుర్తించి, బస్టాండ్ వద్ద చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. మార్చి 10 అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో పోలీసుల అప్రమత్తత, సాంకేతికత వినియోగం ప్రశంసనీయం.

అనంతపురం నగరంలో అర్ధరాత్రి వేళ ఏటీఎం దోపిడీకి స్కెచ్ వేసిన ఒక దొంగకు సినిమా లెవల్లో షాక్ తగిలింది. బ్యాంకు సైరన్ మోగడంతో భయపడి పరుగులు తీసిన నిందితుడిని, పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా వెంబడించి మరీ కటకటాల్లోకి నెట్టారు. మార్చి 10వ తేదీ అర్ధరాత్రి అనంతపురం రైల్వే స్టేషన్ సమీపంలోని ఇండియన్ బ్యాంక్ ఏటీఎంలోకి సాయికుమార్ అనే యువకుడు ప్రవేశించాడు. మొదట డబ్బులు డ్రా చేస్తున్నట్లు నటించిన నిందితుడు, ఎవరూ లేని సమయం చూసి ఏటీఎం మెషిన్‌ను పగలగొట్టేందుకు ప్రయత్నించాడు. మెషిన్ తలుపులు కూడా తెరిచాడు. అయితే, నిందితుడు మెషిన్‌ను ట్యాంపర్ చేయగానే బ్యాంకు సేఫ్టీ సైరన్ ఒక్కసారిగా భారీ శబ్దంతో మోగింది. ఆ శబ్దానికి హడలిపోయిన సాయికుమార్, అక్కడ నుంచి ప్రాణభయంతో పరుగులు తీశాడు. సైరన్ మోగడంతో అప్రమత్తమైన బ్యాంకు సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. త్రీ టౌన్ పోలీసులు రంగంలోకి దిగి ఏటీఎం సెంటర్‌లోని సీసీ ఫుటేజీని పరిశీలించారు. నిందితుడిని సాయికుమార్‌గా గుర్తించిన పోలీసులు, అతను ఎటువైపు పారిపోయాడో తెలుసుకోవడానికి స్థానికంగా ఉన్న సీసీ టీవీ పుటేజీలను పరిశీలించారు బస్టాండ్ వైపు వెళ్తున్నట్లు గుర్తించి, చాకచక్యంగా అతడిని అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పట్టపగలు దారుణం.. స్కూటీ డిక్కీ పగలగొట్టి నిమిషాల్లోనే

TTD: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్‌.. జూన్‌ దర్శనం టికెట్ల కోటా విడుదల

Gold Price Today: తగ్గిన బంగారం, వెండిధర.. ఇవాళ తులం ఎంతంటే..!

FASTag: ఫాస్టాగ్ వాహనదారులకు అలర్ట్.. మార్చి 31 డెడ్‌లైన్

Mushroom: పుట్టగొడుగులు తింటున్నారా ?? అయితే ఈ భాగాన్ని అస్సలు తినకండి..

Follow Us