మూగ జీవుల సంరక్షణకు 3 వేల ఎకరాల్లో అడవి ఏర్పాటు

|

Feb 29, 2024 | 10:57 AM

భారత్‌లోనే అత్యంత ధనవంతుడైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ గొప్ప మనసు చాటుకున్నారు. మూగజీవుల సంరక్షణకు శ్రీకారం చుడుతూ రిలయన్స్ ​ఫౌండేషన్ వంతారా పేరిట సమగ్ర జంతు సంరక్షణ, పునరావాస కేంద్రాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. గాయపడిన జంతువులను రక్షించడం, చికిత్స చేయడంతో పాటు వాటి సంరక్షణ, పునరావాసం ఏర్పాటుచేయడం దీని ముఖ్య ఉద్దేశం. గుజరాత్‌లోని జామ్‌నగర్‌ రిలయన్స్‌ రిఫైనరీ కాంప్లెక్స్‌ 3వేల ఎకరాల్లో దీన్ని ఏర్పాటుచేశారు.

భారత్‌లోనే అత్యంత ధనవంతుడైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ గొప్ప మనసు చాటుకున్నారు. మూగజీవుల సంరక్షణకు శ్రీకారం చుడుతూ రిలయన్స్ ​ఫౌండేషన్ వంతారా పేరిట సమగ్ర జంతు సంరక్షణ, పునరావాస కేంద్రాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. గాయపడిన జంతువులను రక్షించడం, చికిత్స చేయడంతో పాటు వాటి సంరక్షణ, పునరావాసం ఏర్పాటుచేయడం దీని ముఖ్య ఉద్దేశం. గుజరాత్‌లోని జామ్‌నగర్‌ రిలయన్స్‌ రిఫైనరీ కాంప్లెక్స్‌ 3వేల ఎకరాల్లో దీన్ని ఏర్పాటుచేశారు. వంతారా అనేది ఒక కృత్రిమ అడవి. ఇందులో జంతువులు నివసించేందుకు వీలుగా సహజంగా ఉండేలా వసతులు ఏర్పాటుచేశారు. ఈ అడవిలో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏనుగుల కోసం ప్రత్యేకంగా ఆసుపత్రి ఉంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్దది. పూర్తిగా పోర్టబుల్ ఎక్స్​రే యంత్రాలు, శస్త్ర చికిత్సల కోసం లేజర్ యంత్రాలు, అధునాతన సదుపాయాలు ఉన్నాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కేరళలో రోడ్డుకు ఘనంగా పెళ్లి !! ఎందుకంటే ??

పాకిస్తాన్ లోని పంజాబ్‌ కు తొలి మహిళా సీఎం.. చరిత్ర సృష్టించిన మరియం నవాజ్‌

కుమారుడు మృతిని జీర్ణించుకోలేని తల్లిదండ్రులు ఏంచేశారో తెలుసా ??

Varun Tej: ఎంగేజ్‌మెంట్‌కు..పెళ్లికి గ్యాప్ వచ్చింది ఎందుకంటే ??

కెరీర్ టర్న్‌ అయ్యే సినిమా మిస్సు.. వెరీ బ్యాడ్‌లక్ బ్రో

Follow us on