Naaji Noushi: ఒంటరిగా కారులో.. ఆ మహిళకు నా సెల్యూట్‌.. ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌..

|

Jan 01, 2023 | 9:47 AM

ట్యాలెంట్‌ ఎక్కడున్నా తనదైన శైలిలో ప్రోత్సహించడం మన టెక్‌ దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా హాబీ. ఎప్పటికప్పుడు కొత్త కొత్త వీడియోలను పోస్ట్‌ చేస్తూ అందరిలో స్పూర్తి నింపుతుంటారు ఆనంద్‌ మహీంద్రా.


ఖతర్‌లో ఇటీవల నిర్వహించిన ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ పోటీలను నేరుగా వీక్షించేందుకు కేరళకు చెందిన నాజీ నౌషి అనే మహిళ కారులో ఒంటరిగానే భారత్‌నుంచి ఖతర్‌కు వెళ్లారు. ఆమె వేలాది కిలోమీటర్లు ప్రయాణించి ‘సోలో రోడ్‌ ట్రిప్‌’ వెళ్లడం విశేషం. ఈ క్రమంలోనే ఆమె ప్రయాణ వివరాలకు సంబంధించిన వీడియోను ట్విటర్‌ వేదికగా పోస్ట్‌ చేసిన మహీంద్రా.. ఆమె సాహసానికి సెల్యూట్‌ అంటూ ప్రశసించారు. ఫుట్‌బాల్‌ ప్రపంచ కప్‌లో అర్జెంటీనా, మెస్సీల గెలుపుతోపాటు.. ఆమె ప్రయాణం కూడా విజయవంతమైంది. నాజీ నౌషికి, ఆమె సాహసోపేత స్ఫూర్తికి సెల్యూట్‌. థార్‌పై మీ నమ్మకానికి ధన్యవాదాలు’ అని మహీంద్రా పేర్కొన్నారు. ఇదిలా ఉండగా..అర్జెంటీనా జట్టుకు, మెస్సికి నాజీ నౌషి వీరాభిమాని. ఈ నేపథ్యంలోనేఫుట్‌బాల్‌ పోటీలను చూసేందుకు ఖతర్‌ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. తొలుత రోడ్డు మార్గంలో కేరళ నుంచి కొయంబత్తూరు మీదుగా ముంబయి చేరుకున్నారు. అనంతరం ఓడలో వాహనాన్ని ఒమన్‌కు చేర్చారు. అక్కడినుంచి యూఏఈ, కువైట్‌, బహ్రెయిన్‌, సౌదీ అరేబియాల మీదుగా ఖతర్‌కు చేరుకున్నారు. మరోవైపు.. ఆనంద్‌ మహీంద్రా పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది. నౌషి సాహసభరిత ప్రయాణాన్ని మెచ్చుకున్న నెటిజన్లు.. మహీంద్రా పోస్టులను మరోసారి కొనియాడారు. ‘ఆనంద్ భాయ్.. మీ ప్రతి పోస్ట్‌లో విజ్ఞానం, స్ఫూర్తిదాయకమైన సమాచారం ఉంటుంది’ అని ఒకరు కామెంట్‌ పెట్టారు. భారతీయులందరికీ ఇది గర్వకారణమని మరొకరు స్పందించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Crocodile-drone: అబ్భాబ్భా ఎం వీడియో గురు.. తనను క్యాప్చర్‌ చేస్తున్న డ్రోన్‌ను మొసలి ఏం చేసిందో చూస్తే..

School childrens: స్కూల్‌ పిల్లల్లోకి ఆత్మలు.. తాంత్రికుడిని పిలిచి పూజలు నిర్వహణ.. ఎవరో తెలిస్తే షాకే.!

Car accident: డ్రైవర్‌ ర్యాష్‌ డ్రైవింగ్‌.. ప్రశ్నించినందుకు కారుతో ఢీకొట్టి.. నడిరోడ్డుపై దారుణంగా.. వీడియో.

Published on: Jan 01, 2023 09:47 AM