Viral Video: ఎప్పుడూ చూడని టన్నెల్‌ను పరిచయం చేసిన ఆనంద్‌ మహీంద్ర.. వీడియో చూస్తే వావ్‌ అనాల్సిందే..

Updated on: Sep 01, 2022 | 9:51 PM

టన్నెల్‌ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి.? కొండల మధ్య నుంచి వేసే సొరంగ రోడ్డు మార్గం అంటారా. నిజానికి టన్నెల్‌ అనగానే ప్రతీ ఒక్కరికీ ఇదే గుర్తుకొస్తుంది. అయితే ప్రముఖ పారిశ్రామిక వేత్త


టన్నెల్‌ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి.? కొండల మధ్య నుంచి వేసే సొరంగ రోడ్డు మార్గం అంటారా. నిజానికి టన్నెల్‌ అనగానే ప్రతీ ఒక్కరికీ ఇదే గుర్తుకొస్తుంది. అయితే ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్ర సరికొత్త టన్నెల్‌ను పరిచయం చేశారు. ఇది మనుషులు నిర్మించింది కాదు, సహజ సిద్ధంగా ఏర్పడింది. ప్రస్తుతం ఈ టన్నెల్‌కు సంబంధించిన వీడియో నెటిజన్లను అబ్బురపరుస్తోంది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ రోడ్డు మార్గానికి ఇరువైపులా ఎత్తయిన చెట్లు ఉన్నాయి. చెట్లకు అవతలి నుంచి చూస్తుంటే ఆ మార్గం నిజంగానే ఒక టన్నెల్‌ను పోలినట్లు ఉంది. సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే టెక్‌ దిగ్గజం ఆనంద్‌ మహీంద్ర దృష్టిలో పడింది ఈ వీడియో. అంతే వెంటనే వీడియోను ట్వీట్ చేసిన దిగ్గజ బిజినెస్‌ మ్యాన్‌ ఆసక్తికరమైన ట్వీట్‌ను రాసుకొచ్చారు. కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీని ట్యాగ్‌ చేస్తూ ట్వీట్ చేశారు. వీడియోతో పాటు.. ‘నాకు టన్నల్స్‌ అంటే చాలా ఇష్టం. నిజంగా ఇలాంటి ‘ట్రన్నల్స్‌’ గుండా ప్రయాణించడం మరీ ఇష్టం. కొత్తగా నిర్మించే గ్రామీణ రహదారుల వెంట చెట్లు నాటి ఇలాంటి ట్రన్నల్స్‌ను మనం నిర్మించగలమా నితిన్‌ గడ్కరీ జీ?’ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తున్న నెటిజన్లు ఇలాంటి రోడ్లపై ప్రయాణం చేస్తే అసలు ప్రయాణం చేసినట్లే ఉండదని కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Pawan Kalyan: వన్‌ అండ్‌ ఓన్లీ పవర్ స్టార్‌.. ఇది పేరు కాదు ప్రభంజనం.. ఎనలేని పాపులారిటీ..(వీడియో).

Sr.NTR Rare Video: NTRతో అట్లుంటది మరి.. ముహుర్తం టైంకు పెళ్లి అవడంలేదని ఏకంగా..(వీడియో)

 

Published on: Sep 01, 2022 09:51 PM