Viral Video: ప్రతి కుక్కకీ ఓ రోజు వస్తది అంటే ఇదేనేమో.. నిన్నటి వరకు వీధి కుక్క ఇప్పుడు ఫ్లైట్ లో..

|

Jul 16, 2023 | 9:46 AM

సాధారణంగా ఎవరినైనా తిట్టేటప్పుడు కుక్కతో పోల్చి నానా తిట్లు తిడుతుంటారు కొందరు. ఛీ.. వాడిదీ ఓ బతుకేనా.. కుక్కబతుకు.. ఇలాంటి మాటలు మనం అప్పుడప్పుడూ వింటూ ఉంటాం. కానీ కొన్ని కుక్కల బ్రతుకులు చూసిన తర్వాత ఛీ.. పాడు బ్రతుకు.. మనదీ ఓ బ్రతుకేనా..

ఢిల్లీలోని గల్లీల్లో తిరిగే ఓ వీధికుక్క సుడి తిరిగింది. ఇప్పడు ఢిల్లీలో ఫ్లైట్ ఎక్కి విదేశాలకు వెళ్లబోతోంది. అవును ఇక్కడ బక్కచిక్కి బోనులో ఉన్న ఈ కుక్కను ఒకప్పుడు గల్లిలో అందరూ తరిమి తరిమి కొట్టారు. గాయాలపాలై కుంటుకుంటూ తిరుగుతున్న ఈ కుక్కను ఓ స్వచ్ఛంద సంస్థవారు చేరదీసి, వైద్యం చేసి మంచి ఆహారం పెట్టి దానిని పోషిస్తున్నారు. దానికి మోతీ అని పేరుకూడా పెట్టారు. ఇటలీనుంచి వెరాలాజారెట్టి అనే మహిళ ఏదో బుక్కు రాసేందుకు రీసెర్చ్‌ కోసం ఇండియాకి వచ్చారు. ఆమెకంట్లో పడింది ఈ కుక్క. ఎందుకో ఆమెకు ఆ కుక్క తెగ నచ్చేసింది. దాని గతం తెలుకుని, దానిపై జాలిపడి ఆ కుక్కను తనతో ఇటలీ తీసుకెళ్లి పెంచుకోవాలనుకున్నారు. వెంటనే అందుకు కావలసిన, చట్టపరమైన ఫార్మాలిటీస్‌ అన్నీ కంప్లీట్ చేసుకున్నారు. మోతీకి పాస్‌పోర్ట్‌, ఇటలీ వీసా అన్నీ దగ్గరుండి చేయించి ఆ కుక్కను విమానంలో ఇటలీకి తీసుకెళ్లేందుకు అవసరమైన పర్మిషన్లు అన్నీ తీసుకున్నారు. ఇంకేముంది? జూలై 13న వెరా లాజరెట్టి మేడంతో కలిసి మోతీ ఇటలీ ఫ్లైట్‌ ఎక్కబోతోంది. మోతీని చేరదీసిన స్వచ్ఛంద సంస్థవారు కూడా ఎంతో సంతోషంతో ఆ కుక్కకు విమానంలో ఎలా ఉండాలో, జనం మధ్యలో ఎలా ఉండాలో అన్నీ ట్రైనింగ్‌ ఇచ్చి సాగనంపుతున్నారు. ఢిల్లీ గల్లీల్లో ఎవరైనా తిని పడేసిన ఆహారం కోసం వెతికే కుక్క ఇప్పుడు యూరప్‌ రోడ్లలో కార్లలో తిరగబోతోంది. ఇప్పుడు చెప్పండి.. ప్రతి కుక్కకీ ఓ టైం వస్తుంది అంటే ఇదే అనిపిస్తుందికదా..

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...