ఏనుగులు ఎంత గంభీరంగా ఉంటాయో అంతే సౌమ్యంగా ఉంటాయి. వాటిపై కాస్త ప్రేమ చూపిస్తే చాలు మనుషులకు మంచి స్నేహితులైపోతాయి. అలా కాదని వాటికేమైనా హాని తలపెట్టాలని చూస్తే వారి అంతు చూడ్డంలోనూ వెనుకాడవు. తాజాగా ఓ ఏనుగుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ ఏనుగు పార్క్‌కి వచ్చిన ఓ యువతిని చూసి డాన్స్ చేసింది. ఉత్తరాఖండ్ లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ లో ఓ ఏనుగు గొలుసుతో ఓచోట కట్టేసి ఉంది. పార్క్ సందర్శనకు వచ్చిన పర్యాటకులు గజరాజును చూసి వెళ్తున్నారు. అలా వెళ్లిన ఓ యువతి ఏనుగు ముందు డాన్స్ చేసింది. అది చూసి ఆ ఏనుగు కూడా ఆ యువతిని అనుకరించింది. ఆ యువతిలాగే తను కూడా డాన్స్ చేసింది. ఈ వీడియోను సదరు యువతి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ వీడియోను దాదాపు 10 లక్షల మంది లైక్ చేశారు. అంతేకాదు రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొందరు ఏనుగుల ఫీలింగ్స్‌తో ఫన్ చేయకూడదంటే.. గొలుసులతో కట్టేసినప్పుడు ఏనుగులు అలా చేయడం మామూలే అంటూ కామెంట్లు చేశారు. ఇలాంటి వాటిని సమర్ధించకూడదని మరికొందరు అభిప్రాయపడ్డారు. మరిన్ని వీడియోస్ కోసం: Videos Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్.. Allu Arjun Vibrant Look: ఉగ్రగంగమ్మగా పుష్పరాజ్.. సీన్ దద్దరిల్లాలే.. నెట్టింట ఊచకోత కోస్తున్న బన్నీ వీడియో.. Pushpa-2 Video: పుష్ప అడుగుపడితే.. పులి కూడా కుక్క అయిపోవాలే..! సోషల్ మీడియాను రఫ్పాడిస్తున్న పుష్ప..