Thief Trending Video: డోర్ జామ్.. దొంగ ప్లాన్ బ్యాక్‌ఫైర్.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు..!

Updated on: Dec 23, 2022 | 9:10 AM

షాపులో మొబైల్ కొట్టేద్దామనే వచ్చిన దొంగ ఫ్లాన్ బెడిసికొట్టింది. షాపు ఓనర్ ముందు జాగ్రత్తతో చోరీ ప్రయత్నం విఫలమయ్యింది. డోర్ లాకింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయడంతోనే తాను ఈ చోరీని అడ్డుకోగలిగానని


షాపులో మొబైల్ కొట్టేద్దామనే వచ్చిన దొంగ ఫ్లాన్ బెడిసికొట్టింది. షాపు ఓనర్ ముందు జాగ్రత్తతో చోరీ ప్రయత్నం విఫలమయ్యింది. డోర్ లాకింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయడంతోనే తాను ఈ చోరీని అడ్డుకోగలిగానని యజమాని సంతోషం వ్యక్తం చేశాడు. యూకేలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. వెస్ట్ యార్క్‌షైర్‌ డ్యూస్‌‌బరీ పట్టణం ఫోన్ మార్కెట్ షాపులోకి డిసెంబరు 4 సాయంత్రం 4 గంటల సమయంలో ఓ యువకుడు వచ్చాడు. ఫోన్ కొనడానికి వచ్చిన కస్టమర్‌లా నటించాడు. కౌంటర్ వెనుక ఉన్న దుకాణదారుడు అఫ్జల్ అదమ్ కొన్ని ఫోన్‌లను చూపించి, పరిశీలించమని చేతికి మరో మొబైల్ ఇచ్చాడు. దీంతో వెంటనే 1,600 పౌండ్ల విలువైన ఫోన్‌ను తీసుకుని దొంగ ముందుకు పరుగెత్తాడు. కానీ, దుకాణదారుడు అతడ్ని వెళ్లకుండా నిరోధించి రిమోట్‌తో తలుపును లాక్ చేశాడు. ఈ చర్యతో తిరిగి వెనక్కి వచ్చి మొబైల్ అప్పగించి తనను వదిలేయని ప్రాధేయపడ్డాడు. బ్రిటన్‌లోని డ్యూస్‌బరీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడ సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Partners Relationship: సంసారంలో స్మార్ట్‌గా చిచ్చు.. ఇలాగైతే మొదటికే మోసం..! వైవాహిక జీవితం బాగుండాలి అంటే..

Shocking Video: ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా గూడె కట్టేశాయి.. చెవి స్కానింగ్‌లో బయటపడ్డ షాకింగ్ సీన్..

Murder: దారుణం.. అప్పు ఇచ్చిన పాపానికి గొంతు, నరాలు కోసి హత్య చేసారు.! పోలీసులు ఏమ్మన్నారు అంటే..

Published on: Dec 23, 2022 09:10 AM