కాలేజ్‌ ఫెస్ట్‌లో .. వివాహబంధంతో ఒక్కటైన ప్రేమపక్షులు !!

|

Feb 18, 2023 | 9:24 AM

కేరళ రాష్ట్రంలోని మహారాజ కళాశాల యూత్‌ ఫెస్ట్‌.. పూర్వ విద్యార్థుల పెళ్లికి వేదికైంది. యువ జంట తమ ప్రేమకు వేదికైన కళాశాలలోనే వివాహబంధంతో ఒక్కటయ్యారు.

కేరళ రాష్ట్రంలోని మహారాజ కళాశాల యూత్‌ ఫెస్ట్‌.. పూర్వ విద్యార్థుల పెళ్లికి వేదికైంది. యువ జంట తమ ప్రేమకు వేదికైన కళాశాలలోనే వివాహబంధంతో ఒక్కటయ్యారు. వివరాల్లోకి వెళితే..మట్టన్‌చెర్రీకి చెందిన నదీం, పనంగాడ్కు చెందిన కృప ..ఎర్నాకులం లోని మహారాజ కళాశాలలో 2014-17 మధ్య గ్రాడ్యుయేషన్‌ చదివారు. ఆ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కళాశాల పూర్తైనా వీరి ప్రేమ అలానే కొనసాగింది. కుటుంబ సభ్యుల అనుమతితో వివాహ బంధంతో ఒక్కటవ్వాలనుకున్నారు. అయితే, వీరి ప్రేమ పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు నిరాకరించారు. అయినా వీరు పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలో వారి ప్రేమకు వేదికైన కళాశాలలోనే ఒక్కటయ్యారు. కళాశాలలో జరిగిన యూత్‌ ఫెస్టివల్‌ కు హాజరైన ఈ జంట అక్కడ వేలాదిమంది విద్యార్థుల మధ్య దండలు మార్చుకున్నారు. అనంతరం రిజిస్టర్‌ ఆఫీస్‌కు వెళ్లి తమ పెళ్లిన నమోదు చేసుకున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఊరేగింపులో పెళ్లికొడుకును ఎత్తుకుపారిపోయిన గుర్రం !!

అమ్మో బామ్మ.. 110 ఏళ్ల వయసులో కొత్త దంతాలు, జుట్టు !!

Sir: దిమ్మతిరిగేలా చేస్తున్న సార్.. ఫీజుల భారీగానే వస్తానయట !!

టాలీవుడ్ నెం1 హీరో ప్రభాసే.. ఆ వెనకే చెర్రీ, తారక్‌ !!

అబ్బే విజయ్‌లా కాదు.. మా సారు మంచోరు !!

 

Published on: Feb 18, 2023 09:24 AM