US Lender: చంద్రునిపై పక్కకు ఒరిగిన అమెరికా ప్రైవేటు ల్యాండర్‌.! వీడియో వైరల్..

|

Feb 27, 2024 | 8:05 AM

జాబిల్లిపై 50 ఏళ్ల తర్వాత అడుగుపెట్టిన అమెరికా ల్యాండర్‌ ఒడిస్సియస్‌కు సంబంధించి ఆసక్తికర విషయాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం నాసా వెల్లడించింది. ల్యాండ్‌ అయ్యే సమయంలో ఒడిస్సియస్‌ చంద్రుని ఉపరితలాన్ని నిర్దేశించని రీతిలో తాకిందని, దీంతో ల్యాండర్‌ కాస్త పక్కకు ఒరిగినట్లు నాసా తెలిపింది. చంద్రుని దక్షిణ ధృవంలోని క్రేటర్‌ మలాపెర్ట్‌ సమీపంలో ఒడిస్సియస్‌ గురువారం ఉదయం ల్యాండ్‌ అయింది.

జాబిల్లిపై 50 ఏళ్ల తర్వాత అడుగుపెట్టిన అమెరికా ల్యాండర్‌ ఒడిస్సియస్‌కు సంబంధించి ఆసక్తికర విషయాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం నాసా వెల్లడించింది. ల్యాండ్‌ అయ్యే సమయంలో ఒడిస్సియస్‌ చంద్రుని ఉపరితలాన్ని నిర్దేశించని రీతిలో తాకిందని, దీంతో ల్యాండర్‌ కాస్త పక్కకు ఒరిగినట్లు నాసా తెలిపింది. చంద్రుని దక్షిణ ధృవంలోని క్రేటర్‌ మలాపెర్ట్‌ సమీపంలో ఒడిస్సియస్‌ గురువారం ఉదయం ల్యాండ్‌ అయింది. ఇంట్యూటివ్‌ మెషీన్స్‌(IM) అనే ప్రైవేట్‌ స్పేస్‌ కంపెనీ, నాసా సంయుక్తంగా ఒడిస్సియస్‌ను ఎలాన్‌మస్క్‌ స్పేస్‌ ఎక్స్‌కు చెందిన ఫాల్కన్‌ 9 రాకెట్‌లో చంద్రునిపైకి పంపాయి. ల్యాండ్‌ అయిన తర్వాత భూమికి సిగ్నల్స్‌ పంపేందుకు ఒడిస్సియస్‌ కొంత సమయం తీసుకుంది. అయితే ల్యాండింగ్‌ సమయంలో తలెత్తిన ఇబ్బందితో కాస్త పక్కకు ఒరిగినప్పటికీ ఒడిస్సియస్‌లోని అన్ని కమ్యూనికేషన్‌ వ్యవస్థలు చక్కగా పనిచేస్తున్నట్లు ఇంట్యూటివ్‌ మెషిన్స్‌ సీఈవో స్టీవ్‌ ఆల్టిమస్‌ తెలిపారు. ఒడిస్సియస్‌ ల్యాండ్‌ అయిన చోట నీరు గడ్డకట్టి మంచు రూపంలో ఉండటంతో భవిష్యత్తు పరిశోధనలకు ఇది ఒక లూనార్‌ బేస్‌గా పనికొస్తుందని సైంటిస్టులు భావిస్తున్నారు. అయితే ఈ ప్రాంతంలో చాలా గోతులు ఉండటం వారిని కొంత కంగారు పెడుతోంది. ఒడిస్సియస్‌ భూమి నీడలోకి వెళ్లేముందు వారం రోజుల పాటు పరిశోధనలు సాగించి డేటా పంపనుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..

Follow us on