రూ 7.4 లక్షల నుంచి రూ 60 లక్షల ప్యాకేజ్‌కి .. టెకీ పోస్ట్ వైరల్

Updated on: Nov 21, 2025 | 4:17 PM

సాధారణ నేపథ్యం నుండి వచ్చిన ఓ టెక్ నిపుణుడు, టైర్-3 కాలేజీలో చదివినా, తన కృషితో అమెజాన్‌లో ఏటా ₹60 లక్షల ప్యాకేజీతో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజనీర్‌గా ఉద్యోగం పొందాడు. రూ.7.4 లక్షలతో ప్రారంభించి, కోవిడ్ సమయంలో నైపుణ్యాలు పెంచుకొని, 5 రౌండ్ల ఇంటర్వ్యూలను దాటాడు. ఈ స్ఫూర్తిదాయక కథ ఎందరో యువతకు, ముఖ్యంగా నాన్-ప్రీమియర్ కాలేజీ విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తోంది.

సరైన ప్లానింగ్‌ ఉంటే సాధారణ బాక్‌గ్రౌండ్‌ నుంచి వచ్చినా అద్భుతాలు చేయొచ్చని ఓ టెక్ నిపుణుడు నిరూపించాడు. సర్వీస్ ఆధారిత కంపెనీలో కేవలం 7.4 లక్షల వార్షిక పాకేజ్‌తో కెరీర్ ప్రారంభించి, అమెజాన్‌లో రూ.60 లక్షల ప్యాకేజ్‌తో ఉద్యోగం సంపాదించాడు. తన స్టోరీని రెడిట్ లో షేర్ చేయగా , అది క్షణాల్లో వైరల్‌గా మారింది. ఎందరో యువతకు ఆదర్శంగా నిలుస్తోంది. 12వ తరగతిలో 73% మార్కులు మాత్రమే తనకొచ్చాయనీ ఒకప్పుడు చదువు, స్పోర్ట్స్‌లో చురుగ్గా ఉండే తను, ఉన్నట్టుండి వెనుకబడ్డాననీ రాసుకొచ్చాడు. కారణం ఓ టైర్-3 కాలేజీలో చేరడమేనని చెప్పుకొచ్చాడు. అప్పుడు తనకు ఆత్మవిశ్వాసమే ఉండేది కాదని, కానీ ఆ కాలేజీలో తనకు మంచి స్నేహితులు దొరికారనీ చెప్పాడు. ఆ తర్వాత కోవిడ్ సమయాన్ని తనను తాను మెరుగుపరుచుకోవడానికి ఉపయోగించుకున్నట్లు ఆ టెక్కీ తన పోస్టులో వివరించాడు. మొదట ఓ సర్వీస్ ఆధారిత కంపెనీలో రూ.7.4 లక్షల ప్యాకేజీతో ఉద్యోగంలో చేరినట్టు తెలిపాడు. అక్కడ కష్టపడి పనిచేసి, ఆ తర్వాత ఓ స్టార్టప్ కంపెనీకి రూ.13.5 లక్షల ప్యాకేజీతో మారినట్టు చెప్పాడు. ఒకరోజు లింక్డ్‌ఇన్ ద్వారా అమెజాన్ రిక్రూటర్ తనను సంప్రదించాడనీ ఆ తర్వాత ఇంటర్వ్యూ ప్రక్రియ పూర్తి చేసి, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజనీర్ గా ఏడాదికి రూ.60 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం సంపాదించాననీ అన్నాడు. అయితే, ఈ ఉద్యోగం ఒక్కటే తన విజయం కాదని, వ్యక్తిగతంగానే తాను గతంలో కంటే మెరుగైన వ్యక్తిగా మారానని రాసుకొచ్చాడు. ఇప్పుడు మంచి ఫిట్‌నెస్‌తో, సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌తో, గతంలో ఎన్నడూ లేని ఆత్మవిశ్వాసంతో ఉన్నానని అతను తెలిపాడు. ఈ విజయం వెనుక తన ఓపిక, కష్టం ఉన్నట్లు తెలిపాడు. పెద్ద టెక్ కంపెనీలు అభ్యర్థి పాత జీతం ఆధారంగా గాక అభ్యర్థుల శక్తి సామర్థాలు, స్కిల్స్ ఆధారంగా జీతాలు నిర్ణయిస్తాయని తెలిపాడు. అమెజాన్‌లోని ఎంపిక ప్రక్రియ మొత్తం ఐదు రౌండ్లలో జరిగిందని, ఆ సమయంలో హై-లెవెల్ డిజైన్ (HLD) కోసం యూట్యూబర్‌ గౌరవ్ సేన్ వీడియోలను తాను ఫాలో అయినట్లు అనుసరించినట్లు తెలిపాడు.ఇందులో ఆన్‌లైన్ అసెస్‌మెంట్, డీఎస్ఏ రౌండ్, ఎల్ఎల్‌డీ రౌండ్, బార్ రైజర్, హెచ్ఎల్‌డీ రౌండ్ ఉన్నాయని తెలిపాడు. అతని స్టోరీ టెక్ కమ్యూనిటీలో, ముఖ్యంగా నాన్-ప్రీమియర్ కాలేజీల నుంచి వచ్చిన యువతలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. సరైన నైపుణ్యాలు పెంచుకుంటే కెరీర్‌లో ఎంతటి ఉన్నత శిఖరాలనైనా అధిరోహించవచ్చని అతను నిరూపించాడు. “మీ కథ మా లాంటి వారికి ఎంతో స్ఫూర్తిదాయకం” అంటూ నెటిజన్లు అతన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రైతు బిడ్డగా పుట్టి.. లక్ష కోట్ల కంపెనీ అధిపతిగా ఎదిగి

చందమామ మట్టిని తెచ్చేందుకు.. ముహూర్తం ఫిక్స్‌ !! అదే జరిగితే..

ప్రధాని వాచ్‌లో రూపాయి కాయిన్‌..! దాని ప్రత్యేకతలు ఇవే

ఆధార్ కార్డుల అప్డేట్.. డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్

మరో మోడల్‌ చుట్టూ హర్థిక్ చక్కర్లు.. అదేనంటున్న నెటిజన్లు