ఓర్నీ.. ఈ పాము ట్యాలెంట్‌ మామూలుగా లేదుగా.. వేట చూస్తే మైండ్ బ్లాక్

Updated on: Jan 31, 2026 | 9:13 AM

సాధారణంగా పాములు కప్పలను వేటాడుతాయి, కానీ ఈ వీడియోలో ఓ పాము వంతెనపై నుండి చాకచక్యంగా చేపను పట్టుకుంది. పెద్ద చేప పట్టుకోడానికి కష్టపడినా వదల్లేదు. ఈ అరుదైన, అద్భుతమైన చేప వేట వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు పాము ట్యాలెంట్‌కు ఆశ్చర్యపోతూ, ఇలాంటి దృశ్యం అరుదని ప్రశంసిస్తున్నారు.

సాధారణంగా పాములు కప్పలు, ఎలుకలులాంటివాటిని వేటాడి తింటాయి. నీటిలో ఉన్నప్పుడు అక్కడ దొరికే చిన్న చిన్న చేపలు, ఇతర ఆహారం తింటాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే… ఓ పాము చేపను వేటాడటంలో దాని ట్యాలెంట్‌ అదిరిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు పాము ట్యాలెంట్‌ మామూలుగా లేదుగా అంటూ ఆశ్చర్యపోతున్నారు. రల్‌ వీడియో ప్రకారం.. ఓ అటవీ ప్రాంతంలో చిన్న కాలువలా నీరు ప్రవహిస్తోంది. ఆ నీరు చూడ్డానికి ఎంతో స్వచ్ఛంగా కనిపిస్తోంది. ఆ కాలువ పైనుంచి ఓ సన్నని కర్రతో ఏర్పాటు చేసిన వంతెన ఉంది. ఆ వంతెనమీదుగా ఓ పాము వెళ్తోంది. అలా వెళ్తున్న పాము నీటిలో ఈదుతున్న ఓ చేపను చూసింది. దానిని వేటాడాలనుకుంది. అంతే ఆ వంతెనపైనుంచి కాల్వలోకి వేలాడుతూ ఎంతో చాకచక్యంగా చేపను పట్టుకుంది. ఆ చేప తప్పించుకోడానికి చాలా ప్రయత్నించింది. ఆ చేప పెద్దదిగా ఉండటంతో ఆ పాముకి అంత సులభంగా లొంగలేదు. ఈ క్రమంలో పాము కాల్వలో పడిపోయింది. అయినా పాము చేపను వదల్లేదు. ఒక పాము చేపను ఇలా వేటాడం చాలా అరుదనే చెప్పాలి. ఈ వీడియోను ఓయూజర్‌ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్‌ చేశారు. నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ వీడియోను ఇప్పటికే 9 లక్షలమందికి పైగా వీక్షించారు. వేలమంది ఈ వీడియోను లైక్‌ చేస్తూ.. తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జగన్‌ను దెబ్బతీయటానికే లడ్డూ వివాదం లేపారు

కాక్‌పిట్‌లో హాహాకారాలు దొరికిన బ్లాక్‌బాక్స్‌.. ఆఖరి 11 నిమిషాల గుట్టు రట్టు ?

మోమోస్‌ షాపులో అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

Gold Price: పసిడి పరుగులకు బ్రేక్.. ఒక్క రోజులోనే భారీ క్షీణత

Economic Survey 2026: దేశం 20 ఏళ్ల వెనక్కెళ్తుందా ?? ఆర్థిక సర్వేలో షాకింగ్ నిజాలు