ముళ్ల పందులు, చిరుత ఎలా కొట్లాడుకున్నాయో చూడండి

|

Jan 12, 2025 | 2:27 PM

ఆకలితో చిరుతపులి వేటాడుతుండగా..తన పిల్లలను కాపాడుకోవడానికి ముళ్ల పందులు తెగ పోరాటం చేశాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెండు ముళ్ల పందులు వాటి రెండు పిల్లలను తీసుకుని రోడ్డు దాటుతున్నాయి. ఇంతలో అక్కడికి ఓ చిరుతపులి దూసుకు వచ్చింది. వెంటనే అలెర్ట్ అయి పోరాటం మొదలు పెట్టాయి.

ముళ్ల పంది పిల్లలను పట్టుకునేందుకు చిరుత నానా ప్రయత్నాలు చేసింది. అదే సమయంలో రెండు పెద్ద ముళ్ల పందులు తమ పిల్లలను కాపాడుకునేందుకు వెనక్కి తిరిగి చిరుత వైపు పరుగెడుతూ వచ్చాయి. అయినా చిరుత వెనక్కి తగ్గలేదు. ముళ్లు గుచ్చుకున్న కొద్దీ దూరంగా జరుగుతూ, మరోవైపు నుంచి ప్రయత్నిస్తూ వచ్చింది. ఈ వీడియో పాతదే అయినా మరోసారి నెట్టింట వైరల్‌ అవుతోంది. రెండు రోజుల్లోనే ఏకంగా రెండు మిలియన్ల మందికి పైగా వీక్షించారు. పెద్ద సంఖ్యలో లైక్‌ చేస్తున్నారు. అయితే చివరగా చిరుతపులి వాటిని వదిలేసి వెళ్లిపోయిందా? లేక దేనినైనా పట్టుకుందా? అన్నది వీడియోలో లేదు. దీనితో వాటికి ఏమై ఉంటుందో అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

డాకు మహారాజ్ హిట్టా ?? ఫట్టా ?? తెలియాలి అంటే ఈ వీడియో చూడాల్సిందే

‘వదిన’ను పెళ్లి చేసుకున్న సాయికిరణ్ ఫోటోలు వైరల్

రూ.100 కోట్లతో కొత్త ఇల్లు కొన్న స్టార్ హీరోయిన్

దిమ్మతిరిగే న్యూస్.. బన్నీతో బాలీవుడ్‌ స్టార్ డైరెక్టర్ భారీ బడ్జెట్ సినిమా

విశాల్ ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన హీరో