నాగబంధంతో పాటు జల, క్రిమి, రక్తాక్ష.. అగ్ని బంధాలు.. వీటి ప్రత్యేకత ఏమిటి.?

|

Jul 17, 2024 | 11:47 AM

పూర్వం రాజులు తన ఖజానాను అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉంచేవారు. అధర్వణ వేదం ఆధారంగా చూస్తే.. వాటికి ఈ బంధనాలను రక్షణగా పెట్టేవారు. తాంత్రిక, దైవిక శక్తులతో వాటిని బంధించేవారు. అంతేకాదు ఈ బంధనాలు మేరుతంత్రంతో కూడుకున్నవి. వాటిలో జల బంధం, నాగ బంధం, క్రిమి బంధం, రక్తాక్షి బంధం, అగ్నిబంధం ఇలా ఎన్నో బంధనాలను రాజులు ఉపయోగించి తమ భాండాగారాలను కాపాడుకునేవారు. కొన్నిసార్లు ప్రత్యేకమైన దేవతా బంధనాలను కూడా రాజులు వేసేవారు.

అలా మంత్ర శక్తులతో బంధించిన తమ భాండాగారాన్ని తిరిగి తెరవడానికి మంత్ర, తంత్ర శక్తులు కలిగిన ఓ సిద్ధ పురుషుడిని సంప్రదించేవారు. అతడు తన మంత్రశక్తితో ఆ బంధనాన్ని తెరిచేవాడు. లేదంటే ఆ రాజవంశానికి చెందిన ఓ వ్యక్తికి ఆ మంత్రాన్ని ఉపదేశించేవారు. అతను వచ్చి అతి రహస్యంగా ఆ మంత్రాన్ని చెబితే తప్ప ఆ భాండాగారం తెరుచుకోదు. ఇది ఒక అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ “ఎకో యాక్సిస్ ద్వారా ఏదైనా గదిని తెరవడం”. ఇదే మనం ఇప్పుడు కూడా చూస్తున్నాం..ఎలా అంటే.. ఓ గదిలోకి అడుగుపెట్టగానే అక్కడ బల్బ్స్ వెలుగుతాయి.. అలాగే చప్పట్లు కొట్టగానే ఆటోమేట్ గా ఆ బల్బ్స్ లైటింగ్ ఆగిపోతుంది. ఇలాంటివి మనం చూస్తున్నాం.

ఒక అఘోరా, అలాగే ఓ పండితుని వివరణ ప్రకారం హిందూ పూజా విధానాలలో క్రిమిబంధం, జల బంధం, వాయు బంధం, నాగ బంధం, అగ్నిబంధం, ఇలా చాలా రకాల బంధాలు ఉంటాయి. ఏదైనా విలువైన వస్తువుని దుర్వినియోగం కాకుండా కాపాడేందుకు ఇలాంటి బంధాలు వేస్తారు. వీటిలో ఏ బంధం చేతనైనా ఏ వస్తువైనా, గది అయినా బంధీగా ఉంటే దానిని తెరవడం ఎవరికీ సాధ్యం కాదు. ఉదాహరణకి… మంత్రాధీనంలో ఉన్న ఒక వస్తువు లేక, గదికి నాగబంధం ఉంటే దాని తాలూకు సర్పాలు వాటిని ఎప్పటికీ రక్షిస్తూనే ఉంటాయి, పొరపాటున ఆ ద్వారాన్ని బలవంతంగా తొలిచే ప్రయత్నం చేస్తే నిత్యం నాగులు అక్కడ ఉద్భవిస్తూనే ఉంటాయి. అదే రక్తాక్షి బంధంలో ఉన్న వస్తువును తాకగానే వారు రక్తం కక్కుకుని చనిపోతారు. అలాగే క్రిమిబంధంలో ఉన్న ఏదైనా ప్రదేశాన్ని బద్దలుకొడితే అక్కడినుంచి నిరంతరం క్రిములు ఉద్భవిస్తూనే ఉంటాయి. ఆ వస్తువుని మనం దక్కించుకోలేం. అలాగే జలబంధం వేస్తే ఆ ప్రాంతం నుంచి నీరు ఉద్భవిస్తూనే ఉంటుంది. అలాగే ఇతర బంధాలు కూడా.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.