Air India: ఏసీ లేకుండా విమానంలో నరకయాతన.. సొమ్మసిల్లిన ప్రయాణికురాలు.

|

Jun 04, 2024 | 1:55 PM

విమానం బయలుదేరడంలో జాప్యం కారణంగా ప్రయాణికులు ఇబ్బందుల పాలయ్యారు. ఎనిమిది గంటల పాటు విమానంలోనే ఉండిపోయిన వారు ఏసీ కూడా లేక నరకయాతన అనుభవించారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఈ ఘటన వెలుగు చూసింది. తమ ఇబ్బందుల గురించి తెలియజేస్తూ ఓ ప్రయాణికురాలు నెట్టింట పోస్టు పెట్టారు. గురువారం ఉదయం 11 గంటలకు శాన్‌ఫ్రాన్‌సిస్కోకు బయలుదేరాల్సిన ఎయిర్ ఇండియా విమానం 20 గంటల ఆలస్యంగా బయలుదేరిందన్నారు.

విమానం బయలుదేరడంలో జాప్యం కారణంగా ప్రయాణికులు ఇబ్బందుల పాలయ్యారు. ఎనిమిది గంటల పాటు విమానంలోనే ఉండిపోయిన వారు ఏసీ కూడా లేక నరకయాతన అనుభవించారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఈ ఘటన వెలుగు చూసింది. తమ ఇబ్బందుల గురించి తెలియజేస్తూ ఓ ప్రయాణికురాలు నెట్టింట పోస్టు పెట్టారు. గురువారం ఉదయం 11 గంటలకు శాన్‌ఫ్రాన్‌సిస్కోకు బయలుదేరాల్సిన ఎయిర్ ఇండియా విమానం 20 గంటల ఆలస్యంగా బయలుదేరిందన్నారు. తమను విమానంలోనే కూర్చునేలా చేశారని వాపోయారు. కనీసం ఏసీ కూడా లేకపోవడంతో ఎనిమిది గంటల పాటు నరకం కనిపించిందన్నారు. ఉక్కపోత వేడి తట్టుకోలేక కొందరు సొమ్మసిల్లిపోవడంతో తమకు బయటకు పంపించారని చెప్పారు.

ఎయిర్ ఇండియా పనితీరుపై తీవ్ర విమర్శలు చేసిన ఆమె పౌర విమానయాన శాఖమంత్రిని తన పోస్టులో ట్యాగ్ చేశారు. ఎయిర్ ఇండియా విషయంలో ప్రైవటీకరణ దారుణంగా విఫలమైందని అన్నారు. ప్రయాణికులను ఇన్ని ఇబ్బందులకు గురి చేయడం అమానవీయమని వ్యాఖ్యానించారు. కాగా, ప్రయాణికుల ఫిర్యాదుపై ఎయిర్ ఇండియా స్పందించింది. ఆమెకు క్షమాపణలు చెప్పింది. ప్యాసెంజర్లకు కావాల్సిన సహాయసహకారాలు అందిస్తున్నామని పేర్కొంది. ఢిల్లీలో ప్రస్తుతం తీవ్ర వడగాలులు వీస్తున్న విషయం తెలిసిందే. రాజస్థాన్ నుంచి వేడి గాలులు వీస్తుండటంతో ఢిల్లీలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.

 

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.