Cute video: హోం సో క్యూట్.. ఎయిర్ హోస్టెస్‌ ఓ చిన్నారిని కౌగిలించుకుని.. మురిసిపోయిన వైనం..

|

Sep 06, 2022 | 9:01 AM

తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను ఒక్కసారి చూడండి. ఇందులో ముద్దులొలికే బుడతడు విమానంలోకి ప్రవేశించే ముందు క్యాబిన్ సిబ్బందికి తన బోర్డింగ్ పాస్ చూపించాడు.


తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను ఒక్కసారి చూడండి. ఇందులో ముద్దులొలికే బుడతడు విమానంలోకి ప్రవేశించే ముందు క్యాబిన్ సిబ్బందికి తన బోర్డింగ్ పాస్ చూపించాడు. ఇందులో విశేషమేముంది అంటారా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఒక బాలుడు తన చేతిలో బోర్డింగ్ పాస్ పట్టుకుని విమానంలోకి ఎక్కాడు. విమానంలోకి వస్తున్న ఆ చిన్న కుర్రాడు ఎయిర్‌హోస్టెస్‌కు బోర్డింగ్ పాస్ చూపించాడు. అది తీసుకున్న ఆమె ఒకింత ఆశ్చర్యపోయింది. ఎందుకంటే.. ఆ బోర్డింగ్ పాస్ అందించిన కుర్రాడు మరెవరో కాదు.. ఆ ఎయిర్‌ హోస్టెస్‌ కుమారుడే. తన కుమారుడిని చూసిన ఆమె ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. వెంటనే అతడిని కౌగిలించుకుని మురిసిపోయింది.తాను ఓ పెద్ద వీఐపీని కలిశానని, చాలా ఆనందంగా ఉందని, దుబాయ్‌కి తిరిగి వెళ్తున్నామంటూ ఆ వీడియోకు క్యాప్షన్ జోడించారు ఎయిర్‌హోస్టెస్‌. ఆగస్టు 24న షేర్ చేసిన ఈ వీడియో వేగంగా వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు 11 వేల మంది లైక్ చేశారు. అదే సమయంలో తల్లీ కొడుకుల ఈ క్యూట్ వీడియోపై నెటిజన్లు తమ ప్రేమను వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Bride Running on Road: నీ తల్లీ అంటూ మరోసారి తెలంగాణ శకుంతలను గుర్తు చేసిన మహిళా.. నన్ను పెళ్లి చేసుకుంటావా..లేదా..!

Mother sentiment: పసితనంలో తల్లిని పోగొట్టుకొని.. ఆమె తల్లి సమాధి వద్ద ఈ పిల్లాడు చేసిన పనికి మీకు కూడా కనీళ్లు ఆగవు..

Published on: Sep 06, 2022 09:01 AM