‘టాకింగ్ ట్రీ’.. కబుర్లు చెబుదామా! AIతో వండర్‌ చేసిన ట్రినిటి పరిశోధకులు

Updated on: May 27, 2025 | 4:20 PM

చిన్నప్పుడు సరదాగా చెట్టు వెనుక దాక్కుని దాంతో మాట్లాడటం వంటివి చేసేవాళ్లం. ఆ సరదా ఆ అల్లరే వేరు. కొందరు ప్రకృతి ప్రేమికులు చెట్లనే తమ ఆత్మీయులుగా భావించి వాటిని కౌగలించుకోవడం చూశాం. ఇప్పుడు పరిశోధకులు ఏకంగా చెట్టుతో నేరుగా మాట్లాడే సరికొత్త టెక్నాలజీని కనిపెట్టడమే కాదు.. చెట్లతో నేరుగా మాట్లాడే అవకాశాన్ని ఇస్తున్నారు.

చెట్టుకు ప్రాణం ఉంది అది కూడా స్పందిస్తుందని తెలుసుకున్నాం. అది ఎంత వరకు నిజం అనేది కూడా ప్రయోగాత్మకంగా ప్రూవ్‌ చేశారు. అవి ఎలా తన పక్క చెట్లతో సంభాషిస్తుందో కూడా వివరించారు. ఐర్లాండ్‌ రాజధాని డబ్లిన్ లోని ట్రినిటి కాలేజ్‌లో పరిశోధకులు టాకింగ్ ట్రీ టెక్నాలజీని అభివృద్ధి చేసారు. రెండు వందల ఏళ్ల నాటి లండన్ ప్లేన్‌ ట్రీతో మాట్లాడారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఏఐ సాంకేతికతతో చెట్టుకు స్వరాన్ని అందించారు. చెట్టు మనతో మాట్లాడటానికి వీలుగా పర్యావరణ సెన్సార్లు అమర్చారు. అంటే ఇక్కడ సెన్సార్లుగా నేల తేమ, నేల pH, గాలి ఉష్ణోగ్రత, సూర్యకాంతి, గాలి నాణ్యత ఆధారంగా ‘బయోఎలక్ట్రికల్ సిగ్నల్స్’ని చెట్టు తీసుకుంటుంది. ఆ సిగ్నల్స్‌ని ఏఐ సాంకేతికత .. మానవులకు అర్థమయ్యే భాషలా మారుస్తుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం కేవలం ప్రకృతి ప్రయోజనార్థమే అని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రకృతితో మానవులు అనుసంధానమై ఉంటే..అకస్మాత్తుగా అంటుకునే కార్చిచ్చులను సకాలంలో నివారించడం సాధ్య పడుతుందని చెబుతున్నారు. చెట్టుతో ఎలా సంభాషించాలో వీడియో రూపంలో చూపించారు. అక్కడ ట్రినిటీ కాలేజ్లో దాదాపు 200 ఏళ్ల నాటి లండన్‌ ప్లేన్‌ ట్రీ వేర్లకు AI ట్రీ టెక్నాలజీని అనుసంధానించి మాట్లాడారు. నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి ఆ పురాతన చెట్టుతో ఏ విధంగా సంభాషిస్తున్నాడో స్పష్టంగా ఉంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గల్ఫ్‌ దేశాలకు క్యూ కడుతున్న కోటీశ్వరులు! కారణమేంటంటే..

TOP 9 ET News: ప్రభాస్ ఉన్న ఆ 30 నిమిషాలు థియేటర్లో రచ్చ రచ్చే..

శ్రీలీల,రష్మిక ఉందిగా.. మళ్లీ తమన్నాను ఎందుకు? ఇచ్చిపడేసిన హీరోయిన్

నా తొలి ముద్దు.. జీవితమంతా గుర్తు పెట్టుకుంటా..

గుడ్‌ న్యూస్.. రెట్రో OTT రిలీజ్‌ డేట్ వచ్చేసింది