Loading video

చేప కొరకడంతో చెయ్యినే కోల్పోయాడు.. వీడియో

|

Mar 21, 2025 | 12:46 PM

నదిలో, కాల్వల్లో దిగినప్పుడు అందులోని చేపలు కాళ్లను కొరకడం సహజం. అలా చేపలు కాళ్లకు ఉన్న మురికిని మొత్తాన్ని తినేస్తాయి. అయితే ఓ చేప కొరకడం వల్ల ఓ వ్యక్తి ఏకంగా చేతినే కోల్పోయాడు. వినడానికి ఆశ్చరంగా ఉన్నా ఇది నిజం. ఈ ఘటన కేరళలోని కన్నూరు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని థలస్సెరికి చెందిన రాజేష్‌ అనే రైతు ఫిబ్రవరి 10న తన పొలంలోని చెరువును శుభ్రం చేస్తున్నాడు.

 ఈ క్రమంలో అతని చేతి వేలును ‘కడు’ అనేరకానికి చెందిన చేప కొరికింది. చేతికి గాయం కావడంతో రాజేష్‌ స్థానిక ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ వైద్యం చేసి కట్టు కట్టారు. అయినా గాయం తగ్గకపోగా అరచేతిపై బొబ్బలు వచ్చాయి. దీంతో రాజేష్‌ మళ్లీ ఆస్పత్రికి వెళ్లాడు. ఈసారి వైద్యులు అతనికి రకరకాల పరీక్షలు చేశారు. రాజేష్‌ చేతికి గ్యాస్ గ్యాంగ్రీన్ అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకినట్టు తేల్చారు. దాని నుంచి బయటపడాలంటే వ్యాధి వ్యాపించిన భాగాన్ని తొలగించడం తప్ప మరోమార్గం లేదన్నారు. దాంతో చేతి వేళ్లను తొలగించారు. అయినా ఇన్‌ఫెక్షన్‌ పూర్తిగా తొలగకపోవడంతో మొత్తం అరచేతినే తొలగించారు. ఇసుక, బురద నీటిలో కనిపించే ‘క్లోస్ట్రిడియం పెర్పింజెన్స్’ అనే బ్యాక్టీరియా వల్ల ఈ ఇన్ఫెక్షన్ వస్తుందని వైద్యులు తెలిపారు. ఈ బ్యాక్టీరియా కనుక మెదడుకు వ్యాపిస్తే ప్రాణాలకే ప్రమాదమని, అందుకే ముందు జాగ్రత్త చర్యగా అరచేతిని పూర్తిగా తొలగించినట్టు వివరించారు. లక్షమందిలో ఒకరిద్దరికి మాత్రమే ఇలాంటి పరిస్థితి వస్తుందని తెలిపారు. కేరళలో ఈ వ్యాధి ఇద్దరికి సోకగా అందులో రాజేశ్ ఒకరు కావడం గమనార్హం.

మరిన్ని వీడియోల కోసం :

పెంపుడు కుక్కలను కిడ్నాప్ చేసి.. రూ.10 కోట్లు డిమాండ్ .. చివరికి ఏమైందంటే?

ఏసీ కోచ్‌ల్ ప్రయాణిస్తున్న వ్యక్తి.. పడుకుందామని రెడీ అవుతుండగా..వీడియో

ఒక్క టూత్‌ బ్రష్‌తో దుమ్ము దులిపేసిందిగా..వీడియో

పిచ్చి పీక్స్‌కి.. వీడియో చూస్తే వణుకొస్తుంది