AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైతుల పాలిట శాపంగా మారిన నత్తలు

రైతుల పాలిట శాపంగా మారిన నత్తలు

S Haseena
| Edited By: Phani CH|

Updated on: Nov 18, 2025 | 11:34 AM

Share

ఇప్పటివరకు పంటల పై దోమలు దాడి చేయడం పురుగులు దాడి చేయడం చూసాం ...కానీ నత్తలు దాడి చేయడం ఎప్పుడైనా చూశారా... ఉభయ గోదావరి జిల్లాలలో పంటలు పై ఆఫ్రికా జాతి నత్తలు దాడి చేస్తున్నాయి.ఈ నత్తల దాడితో పంటలు పండ్ల తోటలు నిలువునా ఎండిపోతున్నాయి. నత్తలు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి పంట చేతికి అందే సమయానికి నత్తలు తినేయడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. వీటి నివారణ సాధ్యం కాక ఉద్యానవన శాస్త్రవేత్తలను ఆశ్రయించారు రైతులు. ఆఫ్రికా నత్తలుగా పేర్కొనే ఈ నత్తలు వేల సంఖ్యలో పొలాల్లో, తోటల్లో గుంపులు గుంపులుగా సంచరిస్తున్నాయి. గడ్డి, ఆకులు, లేత మొక్కలు అంటూ తేడా లేకుండా అన్నింటినీ తినేస్తున్నాయి. ప్రధానంగా నిమ్మ, కోకో, పామాయిల్, బొప్పాయి, జామ తోటల్లో చెట్టు కాండాలను పట్టుకుని వాటిలోని రసాన్ని పీల్చేస్తున్నాయి. ఈ నత్తల బెడద ఉభయ గోదావరి జిల్లాల్లో బయటపడింది. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలంలోని పెంట్లమ్మ అటవీ ప్రాంతం సమీపంలోని వ్యవసాయ భూముల్లో ఈ ఆఫ్రికా జాతి నత్తలు తిష్టవేశాయి. ఆవపాడు, నల్లజర్ల, ప్రకాశరావు పాలెం, ముసళ్లగుంట, సింగరాజపాలెం ప్రాంతాల్లో ఎక్కువగా ఉద్యాన పంటలను రైతులు సాగు చేస్తుంటారు. ఈ తోటలకు ఆఫ్రికా నత్తల బెడద అధికంగా ఉంది. మూడు నెలల క్రితం అక్కడక్కడ మాత్రమే కనిపించిన ఈ నత్తలు కొద్ది రోజుల్లోనే విపరీతంగా పెరిగిపోయాయి. దాంతో రైతులు వాటిని ఏరి తగలబెట్టారు. పురుగు మందులు పిచికారి చేశారు. అయినా వీటి బెడద తగ్గలేదు. ఈ నత్తలు మొదటగా కేరళలో కనిపించాయి. అక్కడ ఉన్న వక్క తోటలను, ఇతర ఉద్యాన పంటలను దెబ్బతీశాయి. అక్కడి రైతులు గుర్తించేలోపే తీవ్ర నష్టం వాటిల్లింది. నల్లజర్ల మండలంలో కొంత మంది రైతులు వక్క సాగు కోసం మొక్కలను కేరళ నుంచి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఆ మొక్కలతో పాటే ఈ ఆఫ్రికా జాతి నత్తలు, వాటి గుడ్లు ఇక్కడికి వచ్చి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నత్తల బెడద తీవ్రం కావడంతో రైతులు వ్యవసాయ శాఖ అధికారులను ఆశ్రయించారు. దాంతో ఉద్యాన యూనివర్శిటీ శాస్త్రవేత్తలు, కేవీకే శాస్త్రవేత్తల బృందం నత్తలు దాడి చేస్తున్న తోటలను పరిశీలించింది. ఇటీవల పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం రేగువలస గ్రామంలో బొప్పాయి తోటల పై ఈ నత్తలు దాడి చేశాయి. నత్త పురుగు జాతికి చెందినది కాదని, పురుగు మందులు పిచికారి చేసినా ప్రయోజనం ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటికి కీటక నాశన మందులు వాడాలని రైతులకు సూచిస్తున్నారు. కాఫర్ సల్ఫేట్, ఐరన్ సల్ఫేట్ మిశ్రమాన్ని నీటితో కలిపి చెట్లపై పిచికారి చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఒక లీటరు నీటికి 15 గ్రాముల కాపర్ సల్ఫేట్, రెండు గ్రాముల ఐరన్ సల్ఫేట్ పిచికారి చేస్తే ఫలితం ఉంటుందని తెలిపారు. 30 శాతం నత్తలు తక్షణమే చనిపోతాయని, 70 శాతం నత్తలు రెండురోజుల్లో చనిపోతాయని సూచించారు. ఉప్పు ద్రావణం చల్లడం ద్వారా కూడా చనిపోతాయని, అయితే మొక్కలకు ఉప్పు ద్రావణ తీవ్రత ఎక్కువగా పడితే మొక్కలు కూడా చనిపోయే ప్రమాదం ఉందన్నారు. ఆఫ్రికా నత్తల సంతానోత్పత్తి రేటు అధికంగా ఉంటుంది. ఇది ద్విలింగ జాతికి చెందినది కావడంతో రెండేళ్ల వయస్సు లోనే సంతానోత్పత్తి ప్రారంభిస్తుంది. నెలకు 100 గుడ్లు పెడుతుంది. జూలై నుంచి ఫిబ్రవరి వరకు సంతానోత్పతికి అనువైన సమయమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నత్తల నివారణ సామూహికంగా చేపట్టాలని శాస్త్రవేత్తలు సూచించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నమ్మించారు.. వాట్సాప్‌ గ్రూప్‌లో చేర్పించారు..రూ.64 లక్షలు గాయబ్‌

కుంభమేళా మోనాలిసా ఇలా మారిపోయిందేంటి ??

అప్పు చెల్లించకుండా చనిపోయిన స్నేహితుడు.. కోపంతో శ్మశానంలోకి వచ్చి మరీ

పీఎఫ్‌ సొమ్ము విత్‌డ్రాపై ఈపీఎఫ్‌వో హెచ్చరిక

రూ.4 కోట్ల విలువైన కరెన్సీ నోట్లతో వాసవీ కన్యకా పరమేశ్వరీ అమ్మవారికి విశేష అలంకరణ

Published on: Sep 28, 2025 10:42 PM